పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

695 పల్లవి: నీ వేలికవు మాకు నీదాసులము నేము ఆవల నితరుల నే మడుగఁబొయ్యేమా చ. పసురమై వుండి యిచ్చీఁ బక్కన గామధేనువు యొసంగి మానై వుండి యిచ్చీఁ గల్పవృక్షము వెస రాయైవుండి యిచ్చీ వేడుకఁ జింతామణి మసలని శ్రీపతివి మాకు నిచ్చే దరుదా చ. గాలి యావటించి యిచ్చీఁ గారుమేఘము మింట వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత కాలిన పెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ మైలలేని శ్రీపతివి మాకు నిచ్చు టరుదా చ. అండనే కామధేనువ వార్రితచింతామణివి పైండినకల్పకమపు భక్తులకెల్లా నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి దండిగా నమ్మితే నీవు దయఁజూచు టరుదా రేకు:0184-05 లలిత సంపుటము:02-425 పల్లవి: నీ వొక్కఁడవే నాకుఁ జాలు నీరజాక్ష నారాయణ నీవే నాకు గతియని తెలిసితి నెక్కొని యితరము వృథా వృథా చ. మీ నామోచ్చారణమే మెరసిన దుఃఖనివారణము మీ నామోచ్చారణమే మెలఁగు శుభకరము నానావేదశాస్త్రములు నవపురాణేతిహాసములు మీ నామములోనే వున్నవి మిగిలిన విన్నియు వృథా వృథా చ. నీ పాదమూలము నింగియు భువియు రసాతలము నీ పాదమూలము నిఖిలజీవపరిణామములు దీపించిన చరాచరంబులు దివ్యులు మునులును సర్వమును నీ పాదమూలమే మరి నెరి నితరంబులు వృథా వృథా చ. దేవ మీతిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము దేవ మీతిరుమే నుత్పత్తిస్థితిలయములకును ఆకరము శ్రీవేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ దేవ మీశరణము చొచ్చితి దిక్కులన్నియును వృథా వృథా రేకు:0286-02 వసంతం సంపుటము: 03-495 పల్లవి: నీ శరణమే గతి నే నితర మెరఁగ పాశబంధముల పనులేలయ్యా చ. పూఁచిన తొలుకర్మంబులు భోగించక పోవు చాఁచుకున్నయీ శరీరగుణములు చాలునన్నఁ బోవు రేఁచిన జననమరణములు రెంటికిఁ దీసీని మోఁచివచ్చితే విజ్ఞాన మెరఁగఁగ మొదలికిఁ గొనకును యెడ యేదయ్యా చ. కోరిన నా కోరికలు కొనసాగక పాశీవు బాలిఁ బడుచు కాలము దా బడిఁ దగులక పాశీదు మేరతో పంచేంద్రియములు మెడచుట్టక పోవు యే రీతుల సంసారము గెలువఁగ నెదురుబడిని బలిమిఁక నేదయ్యా చ. మనసును వాకునుఁ జేఁతయు మానుమన్నఁ బోవు తనువులోన నా యంతర్యామివి తలఁచక ఇఁకఁ బోదు ఘనుఁడవు శ్రీవేంకటపతి నన్నుఁ గావక ఇఁకఁ బోదు కనికానని యజ్ఞాన జంతువను కడమలెంచనిఁకఁ గొల(లఁ?) దేదయ్యా రేకు: 0318-02 భవుళి సంపుటము:04-103