పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

694 పల్లవి: నీ వెంత నే మెంత నీ కృప యెంచుట గాక భావింప స్వతంత్రుఁడవు పరమేశ్వరుఁడవు చ. సాదించరానివాఁడవు సకలోపాయములను సాదించరానివాఁడవు చొచ్చి వెదకి సాదించరానివాఁడవు వాకుచ్చి యెవ్వరికిని పాదుకొనఁ గొలిచితే భక్తసులభుఁడవు చ. మించరానివాఁడవు మేటిసురలకు నైనా యెంచరానివాఁడవు యిట్టట్టనుచు వంచరాని వాఁడవువడిఁ బ్రతాపములను పంచనుండి నుతించితే భక్తలసులభుఁడవు చ. పట్టరానివాఁడవు బలిమి నేరుపులను ముట్టరానివాఁడవు మొక్కలానను నెట్టన శ్రీవేంకటేశ నీ వెదుట నున్నాఁడవు బట్టబయలు మొక్కితే భక్తసులభుఁడవు రేకు:0271-03 ధన్నాసి సంపుటము: 03-408 పల్లవి: నీ వెటుసేసిన నిజభోగ్యంబె చేవలఁ గైకొని చెలఁగుటఁ గాక చ. దేవ నీ యానతిఁ దిరిగేటి చిత్తము నావద్ద నిలుపుఁగ నా వసమూ యీవల నీవే యిచ్చిన పుట్టుగు యేవిధిం దిప్పిన యిఁక మాన వశమా చ. వామన నీ పంపు వచ్చిన ప్రకృతిదే నా మూఁట వినుమన నా వసమూ శ్రీమంతుఁడ నీచేఁత దేహమిది దోమటి గుడువక తోయఁగ వశమూ చ. నగధర నీ విటు నడపేటి కర్మము నగినగి తోయఁగ నా వసమూ తగు శ్రీవేంకటదైవము నాపాలఁ దగిలిత్రి వితరముఁ దలఁచఁగ వశమూ రేకు: 0180-02 రేవగుప్తి సంపుటము:02-398 పల్లవి: నీ వెరఁగనిది లేదు నీయాజ్ఞ మోచితి నింతే నీవాఁడ నింతె హరి నే ననఁ జోటేది చ. కన్నుల కెందైనఁ జూపుకలది భావము యెన్నఁగ నాయందుఁ బాప మెంచఁ జోటేది విన్ననై చెవుల కింపు వినుట స్వభావము పన్నిన కర్మాలు నన్నుఁ బైకొనఁ జోటేది చ. నాలికకుఁ జవియైతే నమలుటే సహజము నాలి అభోజ్యపునింద నాకుఁ బనేమి మూల వాసనగొనేది ముక్కుకు సహజము జోలిబంధములు నన్నుఁ జుట్టఁగఁ జోటేది చ. కాయము కాయముపొంతఁ గరఁగుటే ఆగుణము సేయని చేఁతలు నాపైఁ జెప్పఁ జోటేది యీయెడ శ్రీవేంకటేశ యిన్నిటిలో నన్నుఁ బెట్టి పాయక నాలో నుందువు పట్టఁగఁ జోటేది రేకు:0092-03 లలిత సంపుటము: 01-455