పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

693 పల్లవి: నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి శ్రీవల్లభ కోరి నిలిచిరి సనకాదులు చ. పట్టపగలులోననే పద్నలుగురు దేవేంద్రు లెట్టుగాఁపురము సేసే దింద్రలోకమున తెట్ట దెరువుననే దిక్కులవారు చూడంగ చుట్టుకుండు టెట్లు చంద్రసూర్యలోకములా చ. యెంచి చూడ బ్రహ్మదేవుఁ డేండ్లు నూరిటివాండ్లు పంచల నెట్లుండేది బ్రహ్మలోకమున పొంచి వుండఁగోరితే నెప్పుడుఁ బాములతోఁ బొత్తు వంచనఁ బాత్రళలోకవాస మేమి బాఁతి చ. యీటువెట్టితే వితరు లిందుకంటె దిగుడి నాటుకొని యెట్టుండేది నానాలోకములా మేటివి శ్రీవేంకటేశ మేమెల్లా నీ బంట్లము చాటువంగోనేటి దండ సత మైతి విపుడు పె.అ.రేకు:0071-01 కేదారగెళ సంపుటము: 15-406 పల్లవి: నీ వున్నచోటే వైకుంఠము నెరసులు మఱి చొరరాదు పావన మది చెప్పేది వేదము పాటింపఁగవలెను చ. దేవుఁడా నా దేహమె నీకు తిరుమలగిరిపట్టణము భావింప హృదయకమలమె బంగారపు మేడ వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే చ. పరమాత్మా నా మనసే బహురత్నంబుల మంచము గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱుపు తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము మరిగితి నీ వున్నయెడల నిఁక మాయలు గప్పకువే చ. ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకుఁ బతివి ఘనుఁడవు నన్నేలితి విఁక కర్మము లెంచకువే రేకు: 0168-03 ధన్నాసి సంపుటము:02-330 పల్లవి: నీ వెంతనే నెంత నేఁడు నాయర్గలి కెంత దేవ నీదాసులఁ జూచితేనే నిన్నుఁ గనుట చ. వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు ఉక్కుమీరి ధరించుక ఉన్నాఁడవట నిక్కిన నీరూప మెంతో నిన్నుఁ గనుఁగొను టెట్టు అక్కజపు వేదముల కగోచరుఁడవు చ. యెన్నో శిరసులట యెన్నో పాదములట యెన్నరాని చేతులట యిట్టి నీమూర్తి కన్నులఁ జూచుట యెట్టు కడగురు తందు కేది అన్నిటా మునీంద్రులకు నచింత్యుఁడవు చ. కోటిసూర్యులొక్కమాటే కూడ నుదయించినట్టు గాటపు నీతిరుమేనికాంతులట మేటివి శ్రీవేంకటేశ మిమ్ము బ్రిష్టించుట యెట్లు పోటిదేవతలకెల్లాఁ బొడవైనవాఁడవు పె.శ్రీ.అ.రేకు:0078-2 దేసాళం సంపుటము: 15-448