పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

692 పల్లవి: నీ యాధీనములింతే నిఖిల ప్రపంచమును మాయాకృతము నీవు మానుమంటే మానదా చ. నీకు నరుహంబైన నిండిన యీ మనసు కాకువిషయూల పాలుగా నరుహమూ చేకొని నీవు పెరరేఁచిన యీ చైతన్యము పైకొని అకర్మముల పాలు సేయఁదగునా చ. అంచల నీ వంతర్యామివైన యీ దేహము పంచేంద్రియముల కొప్పన సేతురా యెంచఁగ నీకుక్షిలోన నెత్తిన యీ జన్మము కొంచెపు భోగములకు గురి సేయవలెనా చ. శ్రీవేంకటేశ నీకుఁ జిక్కిన యీ దాస్యము యీవల సంసారమున కియ్యవలెనా దేవుఁడవు నీవేయని తెలిపితివిదే మాకు జీవులము మమ్మునిఁక చిమ్మిరేఁచ నేఁటికి పె.అ.రేకు: 0066-06 దేసాక్షి సంపుటము: 15-381 పల్లవి: నీ యుపకారమే మాకు నిలిచే దింతే కాక యేయోడా నీ యుదారత్వమేమని నుతింతును చ. నీ కరుణ నాకే పనికివచ్చుఁ గాక మఱి యీకడ నా భక్తి నీకు నెందు కెక్కును కైకొని నాకు నీ రక్షకత్వము ఫలించుఁ గాక నీకు నా సేవల వంక నిండే దేమీ చ. నీవు నన్ను వెదకి మన్నించేదే యొక్కుప గాక భావించి నేఁ దలఁచే లాభము నీకేమి దేవ నీవు చన విచ్చేదే నాకు గుఱి గాక పూవులనేఁ బూజించఁగ పొందేది నీ కేమి చ. యిట్టే నీవు నాకు వరమిచ్చేదే ఘనత గాక నెట్టన నేఁ గొలువఁగ నీ కయ్యే దెంతా గుట్టున శ్రీవేంకటేశ కోరి నీకు శరణంటి వట్టిన వినయమే కాక వచ్చేది నీ కేమీ పె.అ.రేకు:0005-03 నాళంగనాట సంపుటము: 15-028 పల్లవి: నీ వాఁడనై నేను నిచ్చలు సంసారము యేవిధి నుండిన నీకే యింతా శలవు చ. కొమ్మ రాణివాసమై కోరి మూల నుండినాను నెమ్మది దినాలు మగనికి శలవు కమ్మి వడ్డించినయట్టి కంచములోని కూర లెల్లా దొమ్మి విందారగించేది దొరకే శలవు చ. పంట కొలుచు కొటారున పాతరలోఁ బెట్టినాను అంటక రాచముద్రకు ఆదే శలవు యింటివాఁడి జన్నె వట్టి యెంత వుద్దిఁ బెట్టినాను వెంట వెంటఁ దన యిలువేల్పులకే శలవు చ. పెక్కువ సొమ్ములు దాఁచి పెట్టిలోన నుండినాను నిక్కము సామ్మగలవానికే శలవు అక్కజపు శ్రీ వేంకటాధిప నీ శరణంటి మిక్కుటపు నా జన్మము మీకే శలవు పె.అ.రేకు:0062-02 సాళంగనాట సంపుటము: 15-353