పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

691 పల్లవి: నీ మహిమ దలఁచుకొని నీవే రక్షించుట గాక స్వామివి మామీఁద నీవు సడి వేయ నేలా చ. నే నొక్క యణుమాత్రము నీవు మహద్రూపుఁడవు కానీలే నీ ముందర నా కథ యేమి పూచి చిత్రగుప్పలచే పుణ్యపాపము వ్రాయించి ఆని లోకాల కెక్కించి ఆఱడిఁ బెట్ట నేలా చ. నేర నేఁ బరతంత్రుఁడ నీవు స్వతంత్రుఁడవు యీరీతివాఁడ నను నెంచ నేది సారెకు రవిచంద్రులసాక్షిగా మా కిటు లెట్టి కోరి పనులు సేయించి గొరబు సేయ నేలా చ. యెందు నే లక్ష్యము గాను యిన్న నీవు లక్ష్యము పొందుగా ని న్నెంచే చోట భువి నేనెంతా విందుగ నలమేల్మంగ విభుఁడ శ్రీవేంకటేశ కందువ నా యాత్మ వింత గరిసించ నేలా పె.అ.రేకు:0020–06 రామక్రియ సంపుటము: 15-116 పల్లవి: నీ మహిమ లిన్నిటికి నీలకంఠుడు సాక్షి దామోదర మమ్ముఁ గావు దాసులము మీకు చ. కాలకూటవిషమైన గక్కున నరగుటకు తాలిమితో నీ నామత్రయ మంత్రము సోలిఁ బాముల వాయి కట్టే సామ్మగా ధరించుటకు ఆలరి గరుడవాహనాయుధ ధారణము చ. పట్టిన బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తమునకు వొట్టినట్టి తారక బ్రహ్మోపదేశము అట్టకపాల భోజనా శుచి పరిహారము గట్టిగ నీ పాదతీర్థపు గంగాన8) చ. చెలఁగి భూతపిశాచసేవ నివారించుటకు తలఁచేటి నీ మహాతత్త్మ యోగము బలిమి సర్వమంగళాస్పదమై నిలుచుటకు యిలపై శ్రీ వేంకటేశ యిదె నీ సాకారము రేకు:0280-05 పాడి సంపుటము: 03-463 పల్లవి: నీ మాయ లింతేకాక నీరజ నాభుఁడు యివి నా మది నిజమనెట్టు నమ్మేదయ్యా చ. బాలుఁడనై నేఁ జన్నుఁబాలు దాగేనాఁడు వోలి ననుష్టానము లెందుండెనయ్యా చాలి యూనేనె బ్రహ్మచారి నయిన మీఁద వాలి యవె యెందుండి వచ్చెనయ్యూ చ. నేను దినదినమును నిదురవోయే వేళ వూని నిత్యకర్మము లెందుండెనయ్యా జ్ఞానముతో మేలుకొని సంసారినైన వేళ ఆనుకొని యెందుండి అంటుకొనెనయ్యా చ. యేడ కర్మ మేడ ధర్మ మింతలో సన్యాసైతే వేడుక కివియెల్లా నీ విలాసాలు జాడ నీ మనసు వస్తే సరుగఁ గరుణింతువు వోడక శ్రీవేంకటేశ వున్న సుద్దులేఁటికి రేకు:0210-01 భూపాళం సంపుటము: 03-055