పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

690 పల్లవి: నీ కథామృతము నా నిరతసేవన నాకు చేకొనుట సకలసంసేవనం బటుగాన చ. ఇదియె మంత్రరాజము నాకు నేప్రాద్దు నిదియె వేదసంహితపాఠము యిదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకునిదియె సంధ్య నాకిదియ జప మటుగాన చ. యిదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు నిదియె దుఃఖవిరహితమార్గము యిదియె భవరోగహితభేషజము నాకునిదియె వుపనిషద్వాక్యపద్దతిగాన చ. యిదియె దానఫల మీఁజాలినది నాకు యిదియే తలఁపఁ బరహితకర్మము యిదియె తిరువేంకటేశ నీసంస్మరణమిదియె యిదియె ఇన్నియును నటుగాన రేకు:0199-05 సామంతం సంపుటము: 02-512 పల్లవి: నీ చేతఁలోవారము నీవారము యేచి నీకే చేత మొక్కే మిదియే మావ్రతము చ. ఇన్నిటాఁ బూర్జుఁడవు నీ వెరఁగని యర్ధమేది విన్నపము నేఁ జేసే విధమేది మన్నించిన నీమన్ననే మహిమలో మాబ్రదుకెల్ల వున్నతి మీదాసిననే దొక్కటే మావ్రతము చ. ఘనదేవుఁడవు నీకుఁ గడమలు మరియేవి గొనకొని నే నిన్నుఁ గొసరేదేమి పొనుగక యేలితివి పుట్టిన మాపుట్టుగెల్ల ననిచి నిన్ను నమ్మిన నమ్మికే మావ్రతము చ. శ్రీవేంకటేశుఁడ నీవు చిత్తగించనిది యేది భావించి నేఁ బొందని భాగ్యమేది యేవల మాపరభారా లింతయు నీకెక్కినది ఆవటించి నే నీశరణన్నదే మావ్రతము పె.అ.రేకు:0018-04 దేవగాంధారి సంపుటము: 15-102 పల్లవి: నీ దయాధర్మమునకు నీ చిత్తమిఁక యీదెస మానేర్చు లిఁక యెంచగలదా చ. యీవల నా యపరాథ మెఱుకతో నీకుఁ జేసి గావు మని మిమ్మన సంగతులా నాకు కైవసమై నీకు వేళ గాచి యుండి కొలువక సేవించ చేయెత్తి మొక్క సిగ్ను గాదా నాకు చ. మన్నించిన నీ మన్నన మఱచి మత్తుఁడనై యిన్నిటా నీవాఁడ నంటే యే మందువో యెన్నిక ద్రోహినై యిప్పుడిచ్చకాలు సేయఁబోతే నన్నుఁ జూచి పరులెల్లా నవ్వరా యింకాను చ. కొంత సంసారభక్తితో కోరి నీ భక్తుఁడనైతి వంతుల విజ్ఞాన మెటువలె నుండునో యింతట శ్రీ వేంకటేశ యిట్టె నన్ను రక్షించితి వంతర్యామివి నీవు అది నా విన్నపము పె.అ.రేకు:0062-05 కన్నడగౌళ సంపుటము: 15-356