పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

689 పె.శ్రీ.అ.రేకు: 8008-02 బౌళి సంపుటము: 15-457 పల్లవి: నిలువు నా నుడిలోన నిజముగా నిపుడు తలఁగఁ జెల్లదు నీ దాసుల యెడలను చ. బలిమి గద్దని మిట్టిపడినఁ బోనియ్య తల దూర్చుకొని లోన దాఁగినఁ బోనియ్య పెలుచుఁదనము గీపెట్టినఁ బోనియ్య చెలఁగి నూరు మోముసేసినఁ బోనియ్య చ. కొంచెపడి యెంత వేఁడుకొనినాఁ బోనియ్య పించెపుఁగైదువ జళిపించినఁ బోనియ్య వంచించి రాజవైన నవ్వలికిఁ బోనియ్య మించిన ముసలిపై మీఱినఁ బోనియ్య చ. పడఁతులలోన భంగపడినఁ బోనియ్య కడుఁ గరాళించిన కదలి పోనియ్య విడువ నీ పాదారవిందము నా తలపై నిడుకొందు వేంకటేశ యేమైనాఁ బోనియ్యా రేకు: 0354-04 గుండక్రియ సంపుటము: 04-318 పల్లవి:"నిశ్చింతం పరమం సుఖ" మనుమాటే నిజము నిజము తెలియరు గాని ఆశ్చర్యంబిది పరమయోగులకు ననుభవులకు దృష్టాంతము సుండీ చ. కరచరణాదులుగలచైతన్యము గక్కునఁ బానుపుపైనుండి సరుగన సడిలిన నిద్రామందము సమకూడీ నరులకటువలెనే పరమాత్మునిపై సకలోద్యోగ వుపాయంబులు దా దిగవిడిచి ధరఁ దానుండిన బ్రహ్మానందము తను(దానే పైకొనుఁజుండీ చ. వున్నతిఁ దానొక దేశములోపలనుండి క్రితముచూచిన నవియెల్లా అన్ని దేశములు నటుదలపోసిన యంతకుగోచరమైనట్లు యెన్నగఁబూర్వజ్ఞానంబున సర్వేశ్వరుఁడగు హరిఁదలఁచినను సన్నిధియగు సుజ్ఞానానందము సత్యము సత్యంబది సుండీ చ. ననిచిన ప్రపంచకత్పములలో నానావిధముల జంతువులు తనుఁదాఁజూడగరానిరూపు లద్దములోపలఁ గన్నట్లు ఘనుడగు శ్రీవేంకటపతిరూపము గక్కన నెదుటనె సేవించి అనయము తనుఁదా సంతసించుటే యాత్మానందంబిది సుండీ రేకు: 9075-02 -- సంపుటము: 04-579 పల్లవి: నీ కథామృతము నా నిరత సేవన నాకు చేకొనుట సకల సుఖ సేవనంబటుగాన చ. ఇదియె మంత్రరాజము నాకు నేప్రాదు నిదియె వేదసంహిత పాఠము ఇదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన చ. ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు ఇదియె దుఃఖవిరహితమార్గము ఇదియె బహులోకహితభేషజము నాకు ఇదియె వుపనిషద్వాక్యపద్ధతిగాన చ. ఇదియె దానఫలమియ్యఁ జాలును నాకు ఇదియె తపవిరహిత కర్మము ఇదియె తిరువేంకటేశ్వరుని సంస్మరణ ఇదియె యిదియె యిన్నియును నటుగాన రేకు:0008-06 భూపాళం సంపుటము: 01-054