పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

688 రేకు:0119-06 శ్రీరాగం సంపుటము: 02-114 పల్లవి: నిర్మలులు వీరు నిత్యసుఖులు కర్మదూరులు విష్ణుకైంకర్యపరులు చ. పరమజ్ఞానసంపన్నులగువారికిని అరుదుగా దిచటి మహదైశ్వర్యము హరికృపాధనము చేనబ్బిన మహాత్ములకు సరకుగాకుOడు పంచల నిరాధానములు చ. బలిమిని వేదాంతపట్టభద్రులకు నిల బలురాజ్యపదవు లిరుగడబంట్లు లలిమీరి హరిచక్రలాంఛనపు శూరులకు యెలమి విజయములెల్ల నింటిలో నుండు చ. యీవలను శ్రీవేంకటేశు శరణాగతుల కావటించిన పుణ్య మడువుగాదు దైవజ్ఞలయిన యాధర్మస్వరూపులకు వేవేలు భోగములు వెనుతగులుచుండు రేకు: 0351-06 కేదారగెళ సంపుటము: 04-302 పల్లవి: నిలచినవాఁడవు నీవేకాక దైవమా నెలవై ప్రకృతి నేను నీలోనిసామ్ములము చ. తఱి నిరువదేను తత్వములుండఁగాను యొఱఁగని యజ్ఞానానకెవ్వరు గురి నెఱిఁ జైతన్యమెల్లా నీసామ్మె వుండఁగాను యెఱుకవొక్కటేకాక యెవ్వరున్నా రీడను చ. దినలెక్కలూరుపులు తెచ్చి తెచ్చి వొప్పించఁగ యెనలేని జన్మములకెవ్వరు గురి వునికై బ్రహ్మాండము వొళ్ళునీకై వుండఁగాను యేనసే ఆనందమేకా కెవ్వరున్నా రీడను చ. అచ్చపు సుముద్రవంటాత్మలణువైయుండగా యిచ్చఁ గామక్రోధాల కెవ్వరు గురి నిచ్చలు శ్రీవేంకటేశ నీవేలికవై యుండఁగా హేచ్చేటిదాస్యమేకాక యెవ్వరున్నా రీడను రేకు:0272-06 లలిత సంపుటము: 03-417 పల్లవి: నిలిచినచోటనెల్లా నిధాన మీతఁడు యిల వెఱవ వెఱవ నేమిటికి నిఁకను చ. హరి నాకుఁ గలఁడుగా అన్నిటిఁ బరిహరించ నిరతి గర్మములెంత నిండుకుండినా దరిదాపు ఇతఁడేకా తగ వెనుక వేసుకో విరవిరఁ బాపాలు నా వెంటఁ బడినాను చ. గోవిందుఁడు గలఁడుగా కొంకు దీర్చి ననుఁ గావ కావరపు భవములు గదిమినాను దేవుఁడితఁడున్నాఁడుగా దిక్కుదెసై నిలుపఁగా భావపు సంసారవార్ధి పైకొని మంచినను చ. శ్రీవేంకటేశుఁడే చిత్తగించి నన్నేలెఁగా వావాత్ర నింద్రియూలు వళకాడినా యీవల నావల నితఁ డిహపరా లిచ్చెఁగా వావిరి నే దాస్యగర్వముతో నుండినను