పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

687 రేకు: 0312-01 దేశాక్షి సంపుటము:04-067 పల్లవి: నిరంతరంబును నీమాయే పరం పరములాయ పాపవే నీమాయ చ. మును తల్లిగర్భమున ముంచెను నీమాయ వెనక జనించినట్టే వెలసె నీమాయ అనుగు కౌమార బాల్య యవ్వనములు నీమాయ జనులకు దాఁటరానిజలధి నీమాయ చ. ఆస నీమాయ అంగము నీమాయ యీసునఁ గామక్రోధము లివి నీమాయ వాసుల సంసారమున వలఁబెట్టీ నీమాయ గాసిఁబడి యిఁక నెట్టు గడచే నీమాయ చ. యెదురెల్ల నీమాయ యిహమెల్ల నీమాయ పొదలి స్వర్గ నరక భోగము నీమాయ అదన శ్రీవేంకటేశ అంతరాత్మవు నీవె యిదె నీకే శరణంటి నిఁకనేల మాయ రేకు:0118-04 ముఖారి సంపుటము: 02-106 పల్లవి: నిరుహేతుక దయానిధివి నీవు కరుణించు నీకు నొక్కటి విన్నపము చ. దేవా నీమహిమ తెలియ నెవ్వరివశ మీవల నీవే గతెను టింతేకాక భావించలేరు నిన్ను బ్రహ్మాదులు సహితము నీవేడ నేనేడ నేనొక జంతువను చ. చిత్తా హరి నాదిక్కు చేకొని యవలోకించవే యిత్తల సంసారవార్థి యీఁదుచున్నాఁడ హత్తి చూచేవారేకాని అడ్డగించేవారు లేరు పొత్తుల నాధర్మము పుణ్యము నీచేతిది చ. అవధారు శ్రీవేంకటాధీశ నాజన్మము కవిసి యింద్రియములఁ గట్టువడ్డాఁడ జవళి నీపాదములే శరణము చొచ్చినాఁడ తవిలి నీచిత్తమింతే తరవాత నిఁకను రేకు:0192-01 బౌళి సంపుటము:02-468 పల్లవి: నిరుహేతుకాన నన్ను నీవు రక్షించే వింతే నిరతి నాకొరకే పాశీ నిను సేవించేది చ. ముందు సిరులిత్తువని మోక్షము నీ విత్తువని బందుకట్టుదు దుఃఖములC బాపుదువని యిందలి యాసలనేపాశీ యేచిన నాభయభక్తి యెందును నావల్ల నీకు నించుకంతా లేదు చ. జననాలు చూచి చూచి సలి మరణాలు చూచి వెనకటి నీకథలు వినివిని వినుపై యీ యాసనేపాశీ విన్ను సారెఁ బొగడేది వొనర నీయాసేపో వుపకారగురువు చ. లోకులు గొలువఁగాను లోన నీవు వుండఁగాను దీకొని గురుఁడు బోధించఁగాను కైకొని శ్రీవేంకటేశ కరుణించగా నీవు దాకొని యీ యాసకే నీదాసినై కొలిచితి