పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

686 పె.అ.రేకు:0051-06 నాట సంపుటము: 15-292 పల్లవి: నిన్నుఁగొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుఁడవు చ. భూపతిఁ జేరితేఁ గొంత భూ మియ్యనోపుఁ గాని యేపున నున్నతపద మియ్యలేఁడు తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని యేపొద్దుఁ జెడని భోగ మియ్యలేఁడు చ. గరళకంఠు గొల్పితే కైలాస మీ నోపుఁ గాని గరిమ ధ్రువపట్టము గట్టలేఁడు సరి విరించిఁ గొల్పితే సత్యలోకమే కాని విరజానది దాఁటఁగ వెళ్ళవేయలేఁడు చ. అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను నిన్ను నాశ్రయించక కాన్పించనీదు కన్నులెదుట శ్రీవేంకటేశ నీ శరణంటే యెన్నఁగా నీ విచ్చే యీవి యెవ్వఁడూ నీలేఁడు రేకు:0134-03 గుండక్రియ సంపుటము: 02-139 పల్లవి: నిన్నూ నన్నూనెంచుకోని నేరమి గాక పన్నిన సూర్యునికాంతి ప్రతిసూర్యుడౌనా చ. జలధిలోపలి మీను జలధి దా నౌనా జలములాధారమైన జంతువు గాక నెలవై నీలోనివాడఁ నీవే నే నౌదునా పొలసి నీయ్యాధరువుబొమ్మ నింతే కాక చ. రాజువద్దనున్న బంటు రాజే తానౌనా రాజసపు చనవరి రచనే కాక సాజమై నిన్నుఁ గొలిచి సరిగద్దె నుందునా వోజతో నిన్ను సేవించి వుందునింతే కాక చ. ము తైపుఁజిప్పల నీరు మున్నీటివలె నుండునా ముత్తెములై బలిసి లో మొనపుఁ గాక నిత్తైపు శ్రీవేంకటేశ నీశరణాగతులము మొత్తపు లోకుల మాముక్తులము గాక చి.ఆ.రేకు:0010-05 దేవగాంధారిసంపుటము: 10-059 పల్లవి: నిమిష మెడతెగక హరి నిన్ను దలచి మమత నీమీఁదనే మరిపి బదుకుట గాక చ. నిదురచేఁ గొన్నాళ్లు నేరములఁ గొన్నాళ్లు ముదిమిచేఁ గొన్నాళ్లు మోసపోయి కదిసి కోరినను గతకాలంబు వచ్చునె మది మదినె వుండి యేమరక బదుకుట గాక చ. కడుఁ దనయులకు గోరెంత్ర కాంత్రలకు నోరెకSరెంత్ర వెడలయూసలకుఁ గిరెంత్ర వెట్టిసేసి అడలి కావలె ననిన నందు సుఖ మున్నదా చెడక నీ సేవలే సేసి బదుకుట గాక చ. ధనమువెంటాఁ దగిలి ధాన్యంబునకు దగిలి తనవారిఁ దగిలి కాతరుఁ డైనను కనుకలిగి శ్రీవెంకటనాథ కాతువె కొనసాగి నిన్నునే కొలిచి బదుకుట గాక