పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

685 రేకు: 0320-03 సాళంగనాట సంపుటము: 04-114 పల్లవి: నిన్ను నీవే తెలుసుకో నిరుహేతుకబంధుఁడ - వన్నిటాఁ బరతంత్రుఁడ నంతేపా నేను చ. యేమి గూడీ నీఁగర్మ మిలపైఁ జేయఁగ నీకు యేమి మానె వేఁగర్మ మిటు మానఁగ భూమినీనాటక మేల పూర్ణ కాముఁడవు నీవు కామించి కాత్రువుగాక కరుణానిలయ చ. యెంత గూడపెట్టితి నే నిలమీఁదఁ బుట్టఁగాను యెంత నష్టినే జనించ కిట్టుండగా వింతగుయూ యుక్తులెల్ల వృథావాదము లింలే సంతతము ననుఁ గావు సర్వేశ్వరా చ. యెవ్వరు విన్నవించేరు ఇటు నాదెస నీకు యెవ్వరు వద్దనేరు నీ విలఁ గావఁగా రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక అవ్వల వివ్వల శరణాగతరక్షకుఁడా పె.అ.రేకు:0069-01 సాళంగనాట సంపుటము: 15-394 పల్లవి: నిన్ను వేసారించ నేల నీ దాఁకా నేల మన్నించని వారికి నీ మహిమలే చాలు చ. హరి నీ నామమే చాలు నందరిపాపాలు మాన్ప సరి నాపద లడంచ చక్రమే చాలు అరులఁ దెగటారుచునట్టి నీ స్మరణే చాలు పర మొంగను నీపై భక్తియే చాలు చ. దేవ నీ కథలే చాలు తెగి దురుణాలు మాన్ప మూ వంక కర్మము దీర్చ ముద్రలే చాలు భావించి దుఁఖ ముడుప పాదతీర్ధమే చాలు కైవసమై రక్షించ నీ కైంకర్యమే చాలు చ. సంతతసుఖ మియ్య నీ శరణాగతియే చాలు చింత లెల్ల మానుప నీ సేవే చాలు బంతినే యలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు అంతటికి నీ యభయహస్తమే చాలును రేకు:0004-07 దేసాక్షి సంపుటము: 01-027 పల్లవి: నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచి నన్నుఁ కరుణించితే నెన్నికగాక చ. అధికునిఁ గాచు టేమరుదు నన్ను నధమునిఁ గాచుట యరుదుగాక నీకు మదురమ టేమరుదు మధురమూ, చేఁదు మధురమాటే మహిలో నరుదుగాక చ. అనఘునిఁ గరుణింప నరుదుగాదు నీకు ఘనపాపుని నన్నుఁ గాచు టరుదుగాక కనకము గనకము గానేల, యినుము కనకమవుటే కడు నరుదుగాక చ. నెలకొన్నభీతితో నిన్నుఁ జెనకితిఁగాక తలకొన్నసుఖినైనఁ దలఁచనేల నిన్ను యెలమితోఁ దిరువేంగళేఁశుడ నాపాలఁ గలిగి నీకృప గలుగఁ జేతువుగాక