పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

684 పె.అ.రేకు:0059-04 నాట సంపుటము: 15-337 పల్లవి: నిన్నడిగే నాన తీవే నే నీ పుట్టుగులకు పన్నుకొన్న నేరమి నాపై నెట్టు గలిగె చ. పూర్వపు నీవు పురాణపురుషుడవు గనక వుర్విపై నీ వెఱుఁగని దొకటి లేదు పర్విన కోటిసూర్యుప్రకాశుఁడవు గనక సర్వజ్ఞ నీవు గానని చంద మేమీ లేదు చ. వినుతించ నీవు వేదవేద్యుఁడవు గనక మనసులో నీ కెక్కడ మఱపు లేదు అనిశము నీవు సర్వవ్యాపకుఁడవు గనక యెనయఁగ నీకు విరహిత మొందూ లేదు చ. పొంత నీవు పంచమహాభూతేశుఁడవు గనక పంతాన నీవు లేని ప్రపంచము లేదు అంతర్యామివి శ్రీవేంకటాధిపతివి గనక చింతాకంత నీవు లేని చేష్ట లేడా లేవు పె.అ.రేకు:0062-06 కన్నడగౌళసంపుటము: 15-357 పల్లవి: నిన్ను నమ్మి విశ్వాము నీపై నిలుపు కొని వున్నవాఁడ నిఁక వేరే వుపాయ మేమిటికి చ. గతియై రక్షింతువో కాక రక్షించవో యని మతిలోని సంశయము మఱి విడిచి యితరులచే ముందర నిఁక నెట్టాదునో యని వెతతోడఁ దలఁచేటి వెఱ పెల్లా విడిచి చ. తిరమైన నీ మహిమ తెలిసేవాఁడ ననే గరువముతోడి వుద్యోగము విడిచి వెరవున నీ రూపము వెదకి కాన లే ననే గరిమ నలపు నాస్తికత్వమును విడిచి చ. ధ్రువమైన చేఁతలకు తోడు దెచ్చుకొనే ననే అవల నన్యుల మీఁది యాస విడిచి వివరించి యలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ తవిలి నా పుణ్యమంతయు నీకు విడిచి రేకు:0145–03 కన్నడగౌళ సంపుటము: 02-202 పల్లవి: నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని వున్నవాఁడ నిఁక వేరే ఉపాయ మేమిటికి చ. గతియై రక్షింతువో కాక రక్షించవోయని మతిలోని సంశయము మఱి విడిచి యితరులచే ముందర నిఁక నెట్టాదునోయని వెతతోడఁ దలఁచేటి వెఱపెల్లా విడిచి చ. తిరమైన నీమహిమ తెలిసేవాఁడననేగరువముతోడి వుద్యోగము విడిచి వెరవున నీరూప వెదకి కానలేననేగరిమ నలపు నాస్తికత్వమును విడిచి చ. ధ్రువమైన నాచేఁతకు తోడు దెచ్చుకొనేననే అవల నన్యులమీఁది యాస విడిచి వివరించలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ తవిలితి నాపుణ్యమంతయు నీకు విడిచి