పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

681 ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి చ. తనువే గుడియట తలయే శిఖరమట పెనుహృదయమే హరిపీఠమటా కనుఁగొను చూపులే ఘనదీపము లట తనలోపలి యంతర్యామికిని చ. పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమును పిడిఘంటయుట నలువైన రుచులే నైవేద్యములట తలఁపులోపలనున్న దైవమునకు చ. గమనచేష్టలే యంగరంగగతియట తమిగల జీవుఁడే దాసుఁడట అమరిన వూర్పులే యాలవట్టములట క్రమముతో శ్రీవేంకటరాయనికిని రేకు:0314-01 లలిత సంపుటము:04-078 పల్లవి: నిత్యసుఖానంద మిదె నీ దాస్యము సత్యములేని సుఖాలు చాలుఁ జాలు నయ్యా చ. కన్ను చూపుల సుఖము కడు నీచక్కనిరూపె యెన్నఁగ వీనులసుఖమిదె నీపేరు పన్ని నాలుకసుఖము పొదపు నీతులసి వున్న సుఖముల తెరు వొడఁబడమయ్యా చ. తనువుతోడిసుఖము తగు నీకైంకర్యము మనసులోసుఖము నీ మంచిధ్యానము పనివి యూర్పుసుఖము పాదపద్మమువాసన యెనయని పెరసుఖ మేమి సేసేనయ్యా చ. పుట్టుగు కెల్లసుఖము పొల్లులేనినీభక్తి తొట్టి కాళ్లసుఖము పాతురలాడుట జట్టి శ్రీవేంకటేశ మాచనవోలి చెన్నఁడవై వొట్టుకొని మమ్మేలితివోహో మేలయ్యా