పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

680 యిచ్చల మావంటివా రేమెరుఁగుదురయ్యా చ. బాలుఁడు వృద్ధనియెటి పరిభాషలన్నియును మూలమూలలను దేహమునకె కాక యీలో నెంచి చూచితే నెన్నటివాఁడు కోలుముందై పెరిగీనో కొంచె మయ్యినో చ. మంచిది చెడ్డ దనెటిమాఁట లెల్లా భువిలోన యొుంచి చూడ మనుజుల కింతె కాక నించి సర్వపూర్జుఁడవై నీవు లేనిచోటేది తుంచరాదు పెంచరాదు తొల్లె కలవు చ. వాఁడు వీఁడనియెటివచనాలు జగములో పాశీఁడిమి జీవులయందె పారెసఁ గెఁ గాక వేఁడినా కొసరినాను విశ్వవ్యాపకుఁడవై నాఁడు నేఁడు శ్రీవెంకటనాథుఁడవె కలవూ రేకు:0139-03 దేసాక్షి సంపుటము: 02-168 పల్లవి: నిజము దెలియని మానేరమే కాక భజన నీవు చేపట్టినందుఁ గడమా చ. అంచలం బరుసము లోహపుఁ గాళికలనెల్ల యెంచీనా పసిఁడి గావించుఁ గాక నించిన నిన్నాతుమఁ జింతించువారి పాతకాలు మించనిచ్చేవా మేలే మెరయింతుగాక చ. నలువంకరకిరణాలు మేలుగీడని తలఁగీనా యిన్నిటిలోఁ దానే కాక యిల నీదాసుఁడు జాతి నెవ్వఁడైనా నీకృపఁ జెలఁగి పావనుఁ జేసి చేకొనుఁ గాక చ. పూనిన దిక్కులగాలి పొందుగ నీడాడని మానీనా లోకమెలా మలయుఁగాక మానక శ్రీవేంకటేశ మహిలో నీదాసులుండేదేనెలవైనా నీకిరవేకాదా రేకు: 0301-04 బౌళి సంపుటము:04-004 పల్లవి: నిజమో కల్లో నిమిషములోననె భజించు వారల భాగ్యము కొలఁది చ. వొకఁడు కనుదెరచి వున్నది జగమును వొకఁడు కన్నుమూశోగి లేదనును సకలము నిట్లనె సర్వేశ్వరుఁడును వెకలినరులు భావించినకొరెలఁది చ. కడుపు నిండొకఁడు లోకము దనిసె ననును కడుపు వెలితైనఁ గడమను నొక్కఁడు తడవిన నిట్లనే దైవమిందరికి వెడగునరులు భావించిన కొలఁది చ. ముదిసి యొకఁడనును మోక్షము చేర్వని తుదఁ బుట్టోకఁడది దూరమనును యెదుటనే శ్రీవేంకటేశ్వరుఁ డిట్లనే వెదకి నరులు భావించిన కొలఁది రేకు:0114-04 మాళవిగౌళ సంపుటము: 02-082 పల్లవి: నిత్య పూజలివివో నేరిచిన నోహో