పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

679 మఖరక్షకుఁడ నన్ను మన్నించవే చ. నిండును జలనిధులైనా నెఱి నేటిమొత్తములచే నిండదు నామనసైతే నిచ్చా యాసల పండును లోకములోని బహువృక్షతతులైనాఁ బండదు నామనసైతే బహువిషయముల చ. తనియుఁ బసురమైన ధరణిఁ గసవు మేసి తనియదు నామనసు ధనకాంక్షల వొనరఁ గారుచిచ్చెనా నొకవేళ శాంతిఁబొందు పొనిగి యే పొద్దు శాంతిఁబొందదు నామనసు చ. లోకములోఁ గలినపు లోహమైనాఁ గరఁగును కై కొని నామతి గరఁగదు భ్రమసి యీకడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నీకే శరణంటి నెమ్మదిఁ గావఁగదే రేకు:0040-01 సామంతం సంపుటము: 01-243 పల్లవి: నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుఁడ శ్రీనారాయణా చ. దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్యనోపకకదా నన్ను నొడఁబరుపుచు పైపైనె సంసారబంధములఁ గట్టేవు నాపలుకు చెల్లునా నారయణా చ. చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ లేకకా నీవు బహులీల నన్ను కాకుసేసెదవు బహుకర్మములఁ బడువారు నాకొరెలఁ8్చవారలా నారాయణా చ. వివిదనిర్బంధముల వెడలఁద్రోయక నన్ను భవసాగరములఁ దడఁబడఁ జేతురా దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణా రేకు: 0367-05 బౌళి సంపుటము:04-397 పల్లవి: నిచ్చలూ లోకము చూచి నివ్వెరగయిన్యా నాకు చెచ్చెర శ్రీ హరి నీ చిత్తము నాభాగ్యము చ. జీవ మతిసూక్ష్మము చిత్తము చంచలము భావము నిరాకారము భవమెల్ల నెయ్యము యే విధులఁ బొరలెనో యిది నాబ్రదుకు దేవుఁడ నీచిత్తము నాతేఁకువైన భాగ్యము చ. వూరుపెల్ల గాలి నా వుపమెల్ల మాయ కూరిమెల్ల మొరఁగు నా గుణము విచారము నేరుపేదో నేరమేదో నిజము దెలియదు శ్రీ రమణుఁడవు నీ చిత్తము నా భాగ్యము చ. కాలము పారేటిదాడి కాయము తూంట్ల బొంత ఆలరి శ్రీ వేంకటేశ యది నీచేఁత యేలాగు లెరఁగను యిటు నీ శరణనుటే శీలము నాకు నీ చిత్తము నా భాగ్యము చి.ఆ.రేకు:0005-02 గౌళ సంపుటము: 10-026 పల్లవి: నిచ్చలూఁ జెడనియట్టి నీకె తెలుసుఁ గాక