పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

682 రేకు:0012-04 శ్రీరాగం సంపుటము: 01-075 పల్లవి: నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు చ. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడు యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి తైమూర్తి లేకమైన యాతఁడేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు చ. యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరి యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు యేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధారమేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁడద్వంద్వుడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు చ. యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు యేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁడేవేల్పు భువనైకహితమనోభావకుఁడు యేవేల్పు కడుసూక్ష్మమేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు రేకు:0004-05 శ్రీరాగం సంపుటము: 01-025 పల్లవి: నిత్యానంద ధరణీధర ధరారమణ కాత్యాయనీ స్తోత్రకామ కమలాక్ష చ. అరవిOదనాభ జగధాధార భవదూర పురుషోత్తమ నమో భువనేశా కరుణాసమగ్ర రాక్షసలోకసంహారకరణ కమలాదీశ కలిరాజవరద చ. భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద సాగరని జావాస సకలా8)ప నాగారిగమన నానావర్ణనిజదేహ భాగీరథీజనక పరమ పరమాత్మ చ. పావన పరాత్పర శుభప్రద పరాతీత కైవల్యకాంత శృంగారరమణ శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో దేవతారాద్య సుస్థిరకృపాభరణ రేకు:0244-05 భూపాళం సంపుటము: 03-252 పల్లవి: నిత్యానందులము నిర్మలులమిదే నేము సత్యముగ మమ్మాతఁడు సరిఁ బుట్టించఁగను చ. యొక్కడవోయి వెదకే మిటమీఁద దైవమును వొక్కట నంతర్యామై వున్నాఁడదె ఇక్కడ నాతనిగుణా లెన్నేసి చదివే మిఁక పక్కన తన దాసుల భక్తికి సులభుఁడు చ. యేమేమి వేఁడుకొనేము యిటమీఁద నాతని నామములు నాలికపై నటించీనదే నేమమున నింకా నెట్టు నిచ్చలు భుజించేమో కామించి సంసారపు కైంకర్య మాతనిదే చ. ధ్యాన మేమని సేసేము తలఁచినందెల్లాను పూని శ్రీవేంకటేశుఁడే వుండఁగాను నానాఁట నిఁక నేమి నమ్మితి మనేదేమి