పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

677 పండినయోగికిఁ బూర్ణభావనె మంచిది చ. కలకాలము భూమి( గత్రలె వింటిమిగాని నలనహుషాదు లున్నారా యేమి యిలలో నితరులెల్లా నేమి లేక్క యిందుకుఁగా యెలయింపువిషయాల యేమరఁగఁ దగునా చ. చేపట్టి పురాణాలు చెప్పఁగా వింటిమి గాని బాపురెదుర్యోధనుసంపద యేది కాపాడ నిప్పటివారికలిమి యెంచఁగ నేది యూపాటిపనికిఁగా నిది గోరఁ దగునా చ. మళ్లీ మళ్లీ భూమిలోన మాటలె వింటిమి గాని తొల్లిటి బలాఢ్యుల సత్తువ లేవి వెల్లవిరై యొప్పుడూ శ్రీవెంకటనాథ నీదాసు లెల్లకాలముఁ జెడని యీబలిమె నిజము రేకు:0256-01 బౌళి సంపుటము: 03–320 పల్లవి: నిండుమనసే నీ పూజ అండఁ గోరకుండుటదియు నీపూజ చ. యిందు హరి గలఁడందు లేఁడనేటి నిందకుఁ బాయుటే నీపూజ కొందరు చుట్టాలు కొందరు పగనేఅందదుకు మానుటదియే నీపూజ చ. తిట్టులు గొన్నని దీవెనె గొంతని నెట్టుకోనిదే నీపూజ పెట్టిన బOగారుపెOకును నినుమును అట్టే సరి యనుటదియు నీపూజ చ. సర్వము నీవని స్వతంత్రముడిగి నిర్వహించుటే నీపూజ పర్విశ్రీవేంకటపతి నీదాసులపూర్వమనియెడి బుద్ధి నీ పూజ రేకు:0153-03 నాట సంపుటము:02-248 పల్లవి: నిండె నిన్నిచోటులను నీమహిమలే అండనే మొక్కేము నీకు నాదినారసింహా చ. కూరిమి యిందిరమీఁద కోపము అసురమీఁద తారుకాణ నవ్వు దేవతలమీఁదను ఆరీతి నీకొలు విట్టే అహోబలముమీఁద నారుకొనె నీనేరుపు నారసింహా చ. కరుణ ప్రపదమీఁద గన్నులు దిక్కుల మీఁద సరిచేతులు పేగుల జంధ్యాలమీఁద గరిమ నీనటనలు ఘనప్రతాపముమీఁద తిరమాయ నీకోరిక దివ్యనారసింహా చ. శాంతము లోకముమీఁద శౌర్యము శత్రులమీఁద కాంతులెల్లా తనదివ్యకాయముమీఁద చింతదీర వినోదము శ్రీవేంకటాద్రిమీఁద సంతతమై నీకుఁ జెల్లె జయనారసింహా రేకు:0351-03 వసంతం సంపుటము: 04-299 పల్లవి: నిండెను లోకములెల్ల నెరి నితనికరుణ