పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

676 కావించి రక్షించే వుపకార మింతే కాక చ. సామ్మ దినఁబుట్టినట్టి సోమరిబం టేలికకు ఇమ్ముల నందుకుఁ బ్రతి యేమి సేసీని చిమ్ముచు నాతఁడు నేమించిన పనివాటలలో వుమ్మడిఁ జేసేటి వట్టివూడిగాలే కాక చ. ఆసపడి వచ్చినట్టి అతిథి బలురాజుకు రాసిసేసి యేమిచ్చిన రతికెక్కీని బేసబెల్లితనమున ప్రియాన నిచ్చకమాడి మూసి దైన్యపుఁ జేతుల మొక్కు లింలే కాక చ. శరణాగతుఁడ నీకెచ్చట శ్రీవేంకటేశుఁడ దొరనై యేమిట సరిఁదూఁగఁగలను ధరలోన నీవు దయదలఁచి నన్నేలుకోఁగా పరగు నీమఱఁగున బదుకుదుఁ గాక రేకు:0293-02 శుద్ధవసంతం సంపుటము:03-537 పల్లవి: నిండిన జగములెల్లా నీయూధీనము బండు జన్మములవాఁడ భయమేమీ నెరఁగ చ. పాతకపు దేహమిది ప్రకృతి యాధీనము ఆతుమ శ్రీహరి నీయాధీనము యీతల నాతల నేనెవ్వరి నేమనలేను చేతనుఁడ నింతే నేను చిక్కిన వేమెఱఁగ చ. వెలయు నా కర్మము నీ వేదశాస్తాధీనము నిలిచిన జ్ఞానమెల్లానీయాధీనము తలఁచి యెవ్వరి నేఁ దగుఁ దగదనలేను కొలఁది జీవుఁడనింతే కొనమొద లెఱఁగ చ. అక్కడ నా మనసిక నాచార్యాధీనము నిక్కపు నామోక్షము నీయాధీనము యొక్కువ శ్రీవేంకటేశ యెవ్వరి నేమనలేను పక్కన నీ బంటనింతే పరచింత లెఱఁగ రేకు:0241-05 దేసాళం సంపుటము: 03-237 పల్లవి: నిండు కంతటా నున్నది నీమాయ వొండొకరు జనులకు నుపదేశించనేలా చ. నేరకుంటే సంసారము నేరుపును నీమాయ చేరకుంటే గడులోను చేసుకొను నీమాయ వూరకొడఁబడకుంటే వొడఁబరచు నీమాయ పోరి బిడ్డలకు తండ్రి బుద్ధి చెప్పవలెనా చ. నాలికె కారురుచులు నలిఁ దెలుపు నీమాయ బేలుఁడై విరక్తుఁడై భిక్ష మెత్తించు నీమాయ పాలుమాలేమంకునైనా పనిసేయించు నీమాయ రేలుఁబగళకరు ప్రేరేఁపుచుండవలెనా చ. చొక్కించి నోరుఁ జేతికి సూటి చూపు నీమాయ పెక్కులాగుల నన్నిటాఁ బెనగించు నీమాయ వెక్కసపలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ తక్కక నీమహిమిది తలపించవలెనా చి.ఆ.రేకు:0005-05 మలహరి సంపుటము: 10-029 పల్లవి: నిండునిధానమువలె నీవు గలిగుండఁగాను