పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

675 కోరినవిచ్చీఁ గోవో మనసా చ. శుక వరదుని సారింపుగఁ దలఁచుటె సకల భవ విజయము అకలOకము మహా భయ పూరణ మొకటి నొకటి వోహో మనసా చ. పక్షిగమన శుభము దలఁచుటే అభయభోగ విహారమ్ము వక్షపు లక్షీవరుసే సిరులు లక్షలు గోట్లోల్లవొ మనసా చ. ఇంకా నీతలఁపులెన్ని గలిగిన వేంకటాధిపు సేవించఁగదో అంకెలకిన్నియునైన యీ మంకపు గాక నమ్మవో మనసా రేకు:0259-02 లలిత సంపుటము: 03-338 పల్లవి: నాలో నున్నాఁడవు నన్నుఁ గావ(క) నీకుఁబోదు యీలీలఁ బట్టుచీరెరవిచ్చిన వానివలె చ. చుట్టుకొంటిఁ గర్మములు సారిదిఁ బసిరికాయ నట్టనడిమి పురువునడకవలె వట్టిజాలిఁ దిరిగితి వడిఁ బంచేంద్రియముల పట్టిన నీటిలో జలభ్రమణమువలెను చ. ధరలోనఁ బుట్టి పుట్టి తగ వచ్చినందే వచ్చి వరుస రాట్నపుగుండ్రవలె నైతిని అరసి నే నంటుకొంటి అంగనల పొందులను చొరఁబారి వేలుకాడే సూదిరాత్రివలెను చ. అంతటను స్వర్గనరకాదిలోకాలు మెట్టితి బంతిగట్టి నురిపెడి పసురమునై చెంతల శ్రీవేంకటేశ చేరితి నీవద్ద నేఁడు వంతుకుఁ గామధేనువు వద్ది దూడవలెను పె.అ.రేకు:0052-01 బౌళి సంపుటము: 15-293 పల్లవి: నాలోనే నీ వున్నాఁడవు నన్నేల భ్రమయించేవు యీలీల చూచి మఱపై యిటువలె నున్నది చ. దైవమా నిన్నెఱఁగుదు తప్పక కొలువ నోప భావించుకొందు ధర్మము పట్టగ నోప కావలెనందు విరక్తి కడకూ నడప నోప కావరానఁ బగలు చీఁకటి దవ్వేమిటిదో చ. యెఱుఁగుదు సుజ్ఞాన మిట్టే మదిలో నుండదు వెఱతు సంసార మట్టే విడువలేను మఱవను నీపై భక్తి మట్టుపెట్టరాదు బుద్ధి తటిలో నీటిలో నుండే దప్పిగొనే మిదివో చ. చదువుదు శాస్త్రములు సార మందు గ్రహించను వెదకుదు మోక్షచింత విస్తరించను యెదుట శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి సదరానఁబైఁడికి వాసన వచ్చె నిదివో రేకు:0194-05 శ్రీరాగం సంపుటము:02-484 పల్లవి: నావల్ల నీ కేమున్నది నారాయణ నీవు నన్ను