పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

674 పారేటి యీ జంతువుల భ్రమ విడిపించవే చ. మదనభూతము సాఁకి మగువలుఁ బురుషులు అదన విరిదలలై యంగమొలలై పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళఁ జించుకొంటా కొదలు కుత్తికలనుఁ గూసేరు జీవులు చ. పంచభూతములు సోఁకి భ్రమసి యజ్ఞానులై పొంచి హేయములు మన్నుఁ బూసుకొంటాను అంచెల వీడెపురస మందునిందు గురియుచు యెంచి ధనముపిశాచాలిటైరి జీవులు చ. తమితోడ మాయాభూతము సోఁకి బహుజాతి యెముకలుఁ దోలు నరా లిరవుచేసి నెమకి శ్రీవేంకటేశ నిన్నుఁ జేర కెక్కడైన త్రముఁ దా మెరఁగలింతటాఁ జూడు జీవులు రేకు: 0246-05 రామక్రియ సంపుటము: 03-264 పల్లవి: నారాయణుఁడే సర్వనాయకుఁడు వేరే దురాశలు వెదకం జోటేదయ్యా చ. ఆకస మొకపాదము అట్టె భూమొక పాదము పైకొని యొకపాదము పాతాళము యేకమైనాఁ డేడనున్నా యిందులో వారే జీవులు ఆకడఁ బరులఁ గొల్చేమనఁ జోటేదయ్యా చ. కడుపులో జగములు కాయ మిన్నిటాధారము యెడగల చోటనెల్లా యీతని మాయే కడుఁబోరా దీతఁడే కారణ ముందరికి తడవి మరుపాయాలఁ దగులఁ జోటేదయ్యా చ. చేతన్య మీతనిది సృష్టి యీతనిఘటన ఆతుమ శ్రీవేంకటేశుఁ డంతర్యామి రాతిరిఁబగలుఁ దానే రక్షకుఁడు మనలకు పోతరించి ఇఁక మెచ్చి పొగడఁ జోటేదయ్యా పె.అ.రేకు:0015-04 సామంతంసంపుటము: 15-084 పల్లవి: నారాయణుని దివ్యనామము దలఁచలేక వూరకిళ్లఁ దేరకిళ్ల కొడిగట్టుఁ బ్రాణి చ. వెనక జన్మించేనాఁడు వీసమైనఁ గొనిరాఁడు తనువు విడుచునాఁడు తారముఁ గొంపాశీఁడు మొనచూపి నడుమంత్రమునఁ దిరుగాడేటి కనకముకు సామ్మని కాచుకుండుఁ బ్రాణి చ. వుండక పొయ్యేటి వెల్లా వొకఁడు నిలుపలేఁడు అండనె వచ్చేటి వెల్లా అడ్డగించలేఁడు బండు బండై యిందుకుఁగాఁ బరులు రక్షకులంటా గుండె లేకెవ్వరికైనాఁ గొంచపడుఁ బ్రాణి చ. వడి నిట్టే పనులకు వగవఁగ బని లేదు జడియు సంసారక మొక్క సరవి గాదు విడువని విభుఁడు శ్రీవేంకటేశుఁ డుండఁగాను తడవి లే పట్టలేక తమకించుఁ బ్రాణి రేకు: 9117-02 కేదారగెళ సంపుటము: 04-604 పల్లవి: నారాయణుని శ్రీ నామమిది