పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

673 పల్లవి: నారాయణాచ్యుతానంత నిన్నొకచోట గోరి వెదకనేల వీరివల్లఁ గంటిఁబో చ. సాలసి నీ రూపము శ్రుతులలోఁ జెప్పఁగాని బలిమి నాచార్యుఁడైతేఁ బ్రత్యక్షము పలికి నీ తీర్థము భావనలందే కాని అల నీ దాసుల తీర్థ మరచేత నిదివో చ. నీ యూనతు లెన్నఁడు నేము దెలియము గాని మా యాచార్యునిమాట మంత్రరాజము కాయములో నీ వుండేది కడు మఱఁగులు గాని యీ యొడ నీ పరికర మిన్నిటా నున్నదివో చ. అరిది నీవందన మొకర్చావతారానఁ గాని గురుపరంపరనై తేఁ గోటూయఁ బో హరి నిన్ను శ్రీవేంకటాద్రినే చూచితిఁ గాని పరమున నిహమునఁ బOచి చూపె నతఁడు రేకు:0079-05 రామక్రియ సంపుటము: 01-380 పల్లవి: నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో యీరచనలనే యెవ్వరు దలఁచిన యిహపర మంత్రములిందరికి చ. గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు యీ వరుసలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి చ. దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో శ్రీమహిళాపతయే నమో శిష్ట రక్షిణే నమో నమో వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో యీమేరలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి చ. పరిపూర్ణాయ నమో నమో ప్రణవగ్రాయ నమో నమో చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో యిరవుగ నీగతి నెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి రేకు:0225-04 వసంతవరాళి సంపుటము: 03-141 పల్లవి: నారాయణుఁ డీతఁడు నరులాల మీరు శరణనరో మిమ్ముఁ గాచీని చ. తలఁచిన చోటను తానే వున్నాఁడు వలెనను వారి కైవసమెపుడు కొలచెను మూఁడడుగుల జగమెలాను కొలిచినవారిఁ జేకొనకుండునా చ. యొక్కడఁ బిలి(చి)నా నేమని పలికి మొక్కిన మన్నించు మునుముగను రక్కసుల నణఁచి రక్షించు జగములు దిక్కని నమ్మినఁ దిరముగా నేలఁడా చ. చూచిన యందెల్ల చూపును రూపము వోచికఁ (?) బొగడిన వుండు నోటను యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట చేచేతఁ బూజింప సేవలు గొనఁడా రేకు:0286-01 సామంతం సంపుటము: 03-494 పల్లవి: నారాయణుఁడ నీ నామము మంత్రించి వేసి