పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

672 రేకు:0268-04 భూపాళం సంపుటము: 03-392 పల్లవి: నారాయణ నే నస్వతంత్రుఁడను నాకా పనిగా దేవియును ధారుణి లోపలఁ బుట్టించితివి తరువాతి పనులు నీకే సెలవు చ. శ్రీపతి నీకే సమర్పితంబై శేషంబైనది యాతుమ దొల్లే యేపున విషయములందులోఁ దగిలి యేమయిన నీకే సెలవు చూపరఁ బసురము తొరలు వోయినను సామ్మగలుగువాఁడే పరవంజుక పైపైఁ దానే వెదకి తెచ్చి కాపాడఁగ నతనికి భారముగాన చ. యీడులేక శ్రీహరి నీవుండెడి యీ దేహపు నీపరికరమూఁ బాడిగఁ బంచేంద్రియములు పట్టుక బడిఁ దిప్పెడి నీకే సెలవు వోడక యధికులు తమ దాసులు మరివొకరిపంపు లటు సేయఁగను చూడరు తమబలములనే విడిపించుక తామే రక్షింతురు గాని చ. శ్రీవేంకటపతి నీవే నన్నిటు సృష్టించిన జీవుఁడనింతే కావిరి నజ్ఞానము నన్నిటువలెఁ గప్పిన నది నీకే సెలవు ధావతిఁ దలిదండ్రులు తమ బిడ్డల తనువులఁ బంకము లంటినను యేవిధముల నీరార్చి పెంతు రటు ఇన్నిట నీవే గతినాకు రేకు: 9049-02 పాడి సంపుటము: 04-563 పల్లవి: నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో చ. మురహర భవహర ముకుంద మూధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవ బoధ విమోచన నర మృగశరీర నమో నమో చ. జలధి శయన రవిచంద్ర విలోచన జలరుపూభవనుత్ర చరణయుగ బలిబంధన గోపవధూవల్లభ నలినోదర తే నమో నమో చ. ఆదిదేవ సకలాగము పూజిత యూదవకుల మోపూన రూప వేదోద్ధర శ్రీ వేంకటనాయక నాదప్రియ తే నమో నమో రేకు:0184-03 సామంతం సంపుటము: 02-423 పల్లవి: నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకు నే శరణంటినే చ. చలవయును వేఁడియును సటలసంసారంబు తొలఁకు సుఖ మొకవేళ దుఃఖ మొకవేళ ఫలము లివె యీ రెండుఁ బాపములు పుణ్యములు పులుసుఁ దీపునుఁ గలపి భుజియించినట్లు చ. పగలురాత్రులరీతి బహుజన్మమరణాలు తగుమేను పొడచూపు తనుఁ దానె తొలఁగు నగియించు నొకవేళ నలఁగించు నొకవేళ వొగరుఁ గారపువిడె ముబ్బించినట్లు చ. ఇహముఁ బరమునువలెనె యెదిటికల్లయు నిజము విహరించు బ్రాంతియును విభ్రాంతియును మతిని సహజ శ్రీవేంకటేశ్వర నన్నుఁ గరుణించి బహువిధంబుల నన్నుఁ బాలించవే రేకు:0282-06 మాళవి సంపుటము: 03-475