పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67.1 రేకు:0043-02 సామంతం సంపుటము: 01-262 పల్లవి: నారాయణ నీనామము బుద్ధి జేరినాఁ జాలు సిరులేమి బాఁతి చ. ననుపైన శ్రీవిష్ణునామము పేరు కొనఁగానే తేఁకువ మీరఁగా ఘనమైన పుణ్యాలు గలుగఁగా తమకనయముఁ బరమది యేమిబాఁతి చ. నలువైన శ్రీహరినామము మతిఁ దలఁచిననాబOధము లూడఁగా యెలమి దీనిఁ బలియించినా యీకలుషములేల కలుగు నెవ్వరికి చ. వేంకటపతి నామవిభవము కర్మ పంకములెల్లఁ బరిమార్పఁగా బింకమై తలఁపెడి ప్రియులకుఁ యెందునింక నీ సుఖమిది యేమి బ్రాఁతి రేకు:0168-04 ధన్నాసి సంపుటము:02-331 పల్లవి: నారాయణ నీపంపా నాభాగ్యమో ఇది పేరుకొని పిలువని పేరంటమై వున్నది చ. వుడిగినాఁ గామాదు లొక్కొక్కవ్యాజాన వచ్చీ నుడిసి నడుముచొచ్చు చుట్టాలవలె తడవకున్నాఁ గర్మాలు తమ్ముఁ దామె సేయించీ బడిబడిఁ దిరుగును బంట్లవలె చ. చూడకున్నా దురుణాలు సాంట్లు సోదించవచ్చీ వాడవాడలఁ దలవరులవలె యేడ నున్నా లంపటాలు యెదుటనే పొలసీని జోడువాయనీక తోడునీడలవలె చ. తలఁచకున్నా భోగాలు తనువుతోఁ బెనఁగీని చెలరేఁగి గరిడిలో జెట్లవలె బలిమి శ్రీవేంకటేశ భావములో నీమూరితి నిలుపవే యెందుకైనా నిగిడీ నామనసు పె.అ.రేకు:0020–01 ముఖారి సంపుటము: 15-111 పల్లవి: నారాయణ నీవే నాథుఁడ వైతి నాకు గారవించి రక్షించి కరుణించవయ్యా చ. అంచట నా కర్మమనే అలుగు బండారించితి పెంచి యింద్రియాలఁ బంపు వెట్టకుమయ్య వంచి పుణ్యముల మేఁడి వారము మీ కిచ్చితిమి మించిన కామాదులనే మేర గాండ్లేలయ్య చ. మును సే ఆసలనేటి మొదలు గడమ చెల్లె పనివూని పాతకపు పనులేలయ్య మనసనే మోపు నెమ్మది నీకు నప్పగించితి ఘన దుఃఖముల తర కాండ్లేలయ్యా చ. శ్రీ వేంకటేశ నీ భక్తిసీమకు నే నేలికైతి తావుల చింతల దరిద్రము లేలయ్య నీవు నాకుఁ గాణాచి నే నీ యాధీనము వోవల పరధర్మపు దొత్తు కాండ్లేలయ్య