పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

670 రేకు:0299-03 మాళవిగౌళ సంపుటము: 03-574 పల్లవి: నారాయణ నీ నామమహిమలకు గోరఁ బోవుటకు గొడ్డలి దగునా చ. హరియని నొడిగిన నణఁగేటి పాపము సిరుల నేను నుతిసేయఁగఁగలనా పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము దొరకొని వూరకె తొడిగినయట్లు చ. అచ్చుత యనఁగా నందెటి సంపద యిచ్చల నెంచిన నిలఁగలవా కొచ్చికొచ్చి యొక కొండంత కనకము వెచ్చపుఁ బోఁకకు వెల యిడినట్లు చ. యెదుటనే శ్రీవేంకటేశ్వర యనఁగాఁ బొదిగెటి తపముల పుణ్యము గలదా కదిసి సముద్రము గడచి వోడలోఁ జిదిసి యినుము దెచ్చినయట్లు రేకు: 0366-02 లలిత సంపుటము:04-388 పల్లవి: నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు చ. పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు చ. పండె నెడముఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి కొండను నడుముఁ బ్రిగుణరాశి - యివి నిండం గుడుచుటకు నిలుకడ యేది చ. కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ - యందె పరమపద మవల మరేది రేకు:0240-02 దేసాక్షి సంపుటము: 03-228 పల్లవి: నారాయణ నీదాసుల నడకలివి ధారుణి నిదేపనై తగులఁగవలెను చ. ఆతుమలో హరిమీఁది ఆందోళమే వలె చేతికి లోఁగాకుంటేను చింతించవలె ఆతనిఁ జూచేయందుకు నాసలఁ బొరలవలె రీతినివెప్పుడు విచారించుకొనవలెను చ. నీలవర్ణు కథలకు నివ్వెరగు నొందవలె ఆలకించి యందు భ్రమయఁగవలెను తాలిమితో మహిమలు దలపాశీసుకొనవలె వేళవేళ ధ్యానించి వెదకఁగవలెను చ. చేరి శ్రీవేంకటేశు సేవించుకుండఁగవలె గారవాన సదా మరుగఁగవలెను ఆరసి పెద్దలనన్నీ నడుగుచుండఁగవలె నోరునిండా నేపాదూ నుతియించవలెను