పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

669 పె.అ.రేకు:0074-01 మధ్యవవతి సంపుటము: 15-423 పల్లవి: నాయంతనే వుద్దండంబున నీ నగరు చొచ్చి సోదించఁగ లేదు పాయక నను మన్నించి యేలుకో నీ ప్రకాశ మౌట మేలు చ. ధరలో నీ రూపము నీవే దాఁచుకొని యుండఁగను గరుడధ్వజమే నీ గుఱుతు కనుపించెను నాకు బిరుదులు వొగడే శృతులచేతనే పరరేఁగితి నేను పరగిన నీ ప్రతాపతేజమె బయలు సేసె నిన్ను చ. యెవ్వరికి నసాధ్యుఁడవై నీవు యేకతమున నుండఁగాను రవ్వసేసి నిను నాకుఁ దెలిపెను రచనల నీ మహిమె చువ్వన నీ విచ్చు వరదహస్తమె చొప్పుచూపఁగాఁ గంటిని నివ్వటిల్లు నీ కరుణ యిందరికి ని న్నిటువలెనే ముంగిటఁ బెట్టె చ. శ్రీవేంకటగిరిపై రహస్యమునఁ జెలఁగుచు నుండఁగాను భావింప నలమేల్మంగ సంపదలె పట్టిచ్చెను నీ ప్రభావము దైవికమునఁ బ్రకటించిన తొంటి వుదారగుణము వినిశరణు చొచ్చితిమి యీవల నావల మీ చిహ్నములే యింత సేసె మిమ్ము రేకు: 0109-06 గుండక్రియ సంపుటము: 02-054 పల్లవి: నారాయణాచ్యుతానంత గోవిందా నేరరాదు విజ్ఞానము నీ వియ్యక లేదు చ. నిగమాంతవిదులై తే నిన్నెఱుఁగుదురు గాక మృగసమానులకేల మీమీఁది భక్తి వెగటుగాఁ గృపతోడ విశ్వరూపు చూపినాను పగటు దుర్యోధనుఁడు బహురూప మనఁడా చ. చిరపుణ్యులైతే మీ సేవలు సేతురు గాక దురితచిత్తులకు మీత్రోవ యేఁటికి గరిమఁ బ్రత్యక్షమై కంబములోఁ గలిగినా హిరణ్యకశిపుఁడు మిమ్మెంచి శరణనెనా చ. దేవతలయితే మిమ్ముఁ దెలియనేర్తురు గాక యేవల నసురులు మిమ్మెఱిఁగేరా శ్రీవేంకటాద్రిమీఁద సిరితో నీ వుండఁగాను కేవల సంసారు లెఱిఁగియును మఱవరా రేకు: 0368-04 మాళవిగౌళ సంపుటము: 04-402 పల్లవి: నారాయణ నిను నమ్మిన నాకును మేరతో నీపాదమే గత్రి గలిగె చ. చింతా జలధులఁ జిక్కిన దాఁటించ నంతట నీ పాద మదె తేప కాంతల మోహపు కట్లు దెంచఁగ పంతపు నీ పాద పరశువు గలిగె చ. అత్రిదురిత్రపOక మOదినఁ గడుగ(గ మితి నీ పాదమే మిన్నేరు రతిఁ గర్మజ్ఞలు రాఁజిన నార్చఁగ వ్రతము నీపాదమే వానయై నిలిచె చ. జిగి నజ్ఞానపు చీఁకటి వాయఁగ తగు నీ పాదము దయపు రవి నగు శ్రీ వేంకటనాథ నన్నేలఁగ మిగులఁగ నీ పాదమే శరణంబు