పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

668 పె.అ.రేకు: 0065-01 శంకరాభరణం సంపుటము: 15-370 పల్లవి: నానావుపాయముల నన్నుఁ గాచేది పాడి దీన రక్షకుఁడ నాకు దిక్కయి నిలువవే చ. శరణు చొచ్చినవాఁడు సర్వాపరాధి యైనాను పరగఁ దప్పులు మఱి పట్టఁ దగదు సరవిఁ బూఁత్రవాఁడెంత్ర సలిగలఁ బొరలినా అరసి యందుకుఁగా నలుగఁగఁ దగదు చ. పంచ చేరి వున్నవాఁడు పనికిరాకుండినాను వంచనతో వాని విడువఁగఁ దగదు కొంచెపడి మొక్కేవాఁడు గుణహీనుఁ డైనాను అంచెల మొుగమూడక అదలించఁ దగదు చ. మన్నన బంటైనవాఁడు మందెమేళాన నుండినా పన్ని మనసున యెగుపట్టఁ దగదు యిన్ని విధములవాఁడ నిటు నే శ్రీవేంకటేశ నన్నుఁ గాచుట గాని మిన్నక దూరఁ దగదు రేకు:0018-02 గుజ్జరి సంపుటము:01-108 పల్లవి: నాపాలి ఘన నిధామవు నీవే నన్ను నీ పాల నిడుకొంటి నీవే నీవే చ. ఒలిసి నన్నేలె దేవుఁడవు నీవే, యెందుఁ దొలగని నిజబంధుఁడవు నీవే పలుసుఖమిచ్చేసంపదవునీవే, యిట్టే వెలయ నిన్నియును నీవే నీవే చ. పొదిగి పాయని యాపుడవు నీవే, నాకు నదనఁ దోడగుదేహమవు నీవే మదమువా పెడి నామతియు నీవే, నాకు వెదక నన్నియును నీవే నీవే చ. యింకా లోకములకు నెప్పుడు నీవే, యీ పంకజభవాదిదేవపతివి నీవే అంకలి వాపఁగ సంతకు నీవే తిరువేంకటేశ్వరుఁడవు నీవే నీవే పె.అ.రేకు:0053-01 గౌళ సంపుటము: 15–299 పల్లవి: నాయంత జ్ఞానము లేదు నాకు మావారు చెప్పిన చాయపాటుబుద్దులకే శరణంటి నిన్నును చ. విన్నపము సేసేనంటే వేళ నీ కేదో యెఱుఁగ మన్నించుకొలఁదీ నీ మన సెఱుఁగ సన్నుతించే నంటేను చక్కనిమాట లెఱుఁగ నన్ను నెట్టు రక్షించేవో నమ్మితి నే మిమ్మను చ. సేవచేసి నిన్ను మెప్పించేనంటే భక్తి నేర నీవాఁడనై కొల్చేనంటే నేమము నేర పూవులఁ బూజించేనంటే పొందగు మంత్రము నేర దైవమా నీవే దిక్కు ధరించితి ముద్రలు చ. హితవరి నయ్యేనంటే నేకాంతము దెలియ మతిఁ దలఁచేనంటే మర్మము దెలియ సతమై శ్రీవేంకటేశ్వర నీవే నాకు గతి యని మొక్కితిఁ గరుణించే దెట్లో