పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

665 రేకు: 01:15-01 శంకరాభారణం సంపుటము: 02-085 పల్లవి: నాటికి నాఁడు గొత్త నేటికి నేఁడు గొత్త నాటకపు దైవమవు నమో నమో చ. సిరుల రుక్మాంగదుచేతి కత్తిధారం దొల్లి వరస ధర్మాంగదుపై వనమాలాయ హరి నీకృపకలిమి నట్లనే అరులచే కరిఖడ్గధార నాకుఁ గలుమదండాయు చ. మునుప హరిశ్చంద్రు మొనకత్తిధారం దొల్లి పారెనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ వనజాక్షనీకృపను వరశత్రులెత్తి నట్టిఘనఖడ్గధార నాకుఁ గసూరివాటాయ చ. చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుపుము( టెడ(జూపి కాచినట్టు అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియుఁ బాపి యిల నన్నుఁ గాచినది యెన్నఁ గతలాయ రేకు:0299-05 ముఖారి సంపుటము: 03-576 పల్లవి: నానాఁటి బదుకు నాఁటకము కానక కన్నది కైవల్యము చ. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాఁటకము యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును కట్టఁగడపటిది కైవల్యము చ. కుడిచే దన్నము కోక చుట్టెడిది నడుమOత్రపు పని నా(టకము వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు గడి దాఁటినపుడే కైవల్యము చ. తెగదు పాపమును తీరదు పుణ్యము నగినగి కాలము నాఁటకము యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక గగనము మీఁదిది కైవల్యము రేకు:0227-04 నాట సంపుటము: 03-153 పల్లవి: నానాటికిఁ బెరిగీని నరసింహము ఆనుక వరములిచ్చీ నౌభళపుసింహము చ. వేఁడి ప్రతాపముతోడ విభవాలు మెరయుచు మూఁడుమూర్తు లొక్కటైన ముఖ్యసింహము వాఁడివాఁడి కోరలతో వడి నసురఁ జక్కాడి తీఁడేటి మీసాలతోడి దేవదేవసింహము చ. సరుస శంఖచక్రాది సకలాయుధాలు వట్టి పరబ్రహ్మమే తానైన పటుసింహము వరుసఁ గొలువులు దేవతలెల్లాఁ జేయఁగాను తిరమైన కృపతోడి దివ్యసింహము చ. కేలి సింహాసనముపై కిరీటము ధరియించి చాలు వేయిచేతుల కాంచనసింహము పాలించి ప్రపదుని భక్తుల పాలిటి కిలువేలుపై శ్రీసతితో శ్రీవేంకటాద్రి సింహము