పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

664 రేకు:0267-02 లలిత సంపుటము: 03–384 పల్లవి: నాకేల విచారము నాకేల యాచారము సాకిరైనవాఁడ నింతే సర్వేశుఁడే దిక్కు చ. ప్రపంచ మధీనము పాలుపడ్డ దేహమిది ప్రపంచముతోడి పాటు పరగీని యెపుడూ నీయూతుమ యీశ్వరాధీనము అపు డాతఁ డెట్టునిచె నట్టె అయ్యిని చ. కర్మాన కధీనము కలిములు లేములు కర్మమెట్టు గల్పించెఁ గలిగీని అర్మిలి నాయాచార్యు నధీనము మోక్షము ధర్మమతని కృపను తానే వచ్చీని చ. చిత్తమున కధీనము చిల్లరయింద్రియములు చిత్తము చిక్కినప్పుడు చిక్కీనవి హత్తి శ్రీవేంకటేశుదాస్య మధీనము జన్మము పొత్తుల నందుకు నది పూఁచినట్టయ్యిని పె.అ.రేకు:0040-02 గుజ్జరి సంపుటము: 15-226 పల్లవి: నాకొఱకే గడించెనో నగి యీలోకము హరి లాకలై యెటు చూచినా లంపటా లిటున్నవి చ. తీరనిమాయ నా వొక దేహసంబంధానకే కా వూరఁ గూటపు సంసార మొగిఁ జేసేము ధారుణిలో నాయొక్కతగు బ్రదుకున కే కా యీరీతి సీమలో యిండ్ల యొక్కడ చూచినను చ. బంతినే నాకు నానాఁటి పట్టెఁడు గూటికే కా వంతఁ గృషిగోరక్షవాణిజ్యాదులు వంతుల నూరేండ్లుండే వట్టియాసలకునే కా పంతపు బ్రహ్మాండము పిఱుఁదుకొనేది చ. కొంచెపు దేవరకును కొండంత పత్తిరివలె ముంచుకొని వున్న దిదె మోచి గర్వము అంచల శ్రీవేంకటేశుఁ డన్నిటి కొక్కటే కీలు యెంచి నీ శరణనఁగా నితఁడే మన్నించెను పె.అ.రేకు:0003-03 బౌళి సంపుటము: 15-016 పల్లవి: నాగుణాలు దలఁచక నీగుణాలే తలఁచుకో యేగతినీ మానరాదు యింకనైనాను చ. తెచ్చి నా గురుఁడు నిన్ను తిరువారాధన సేయ నిచ్చినాఁడు తలఁచుకో యింకనైనాను అచ్చుమోపి దాసునిఁగా నంగవించిరి నీ దాసు లిచ్చల నన్నుఁ జేపట్టు మిందులకు నైననాను చ. శరణాగతరక్షణ చాటితి నీ భక్తులకుఁగా యిరవుగాఁ దలఁచుకో యిదియైనాను తిరుమంత్రమే నన్నుఁ దెచ్చి నీ సొమ్ముగఁ జేసె యొరవు లేక కాచుకో యిందులకైనాను చ. యిట్టె అభయ హస్త మెత్తితి వెవ్వరికిఁగా యెట్టనెదుటఁ దలఁచు మిదియైనాను గట్టిగా శ్రీ వేంకటేశ కడు నీ నాస మందమే యెట్టయినాఁ దలఁచుకో యింకనైనాను