పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

663 రేకు: 0301-02 దేసాళం సంపుటము:04-002 పల్లవి: నాకు నాకే సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను చేకొని నీవే మన్నించఁ జెయ్యొగ్లేఁగాని చ. సేయరాని పాపములు సేసివచ్చి యేనోర నాయెడ నిన్ను వరములడిగేను కాయముతో నింద్రియకింకరుఁడనై యేమని చేయార నీబంటనని చెప్పుకొనేను చ. వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి యేగతిఁ గొసరి నీపై నేఁట వేసేము అగడపు బంగారుకాతుమనే నమ్ముకొని భోగపుమోక్షము నెట్టు వొందించు మనేము చ. కలుపుట్టుగుబదుకు కాంతలకు వెచ్చపెట్టి వలసి నేఁడెట్టు నీవార మయ్యేము నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి బలిమిసేసి నీకెట్టు భారము వేసేము రేకు:0184–02 ముఖారి సంపుటము:02-422 పల్లవి: నాకు నీవు గలవు హరి నాలోపలనుండి పైకొని యిన్నియు బదుకనీవయ్యా చ. పసిగొని రుణానుబంధము కొలఁదే పసులునుఁ బడతులు బహుసుతులు సముగావు తమవంతులు దీరిన పసగా నవియే బదుకనీవయ్యా చ. పెనగిరిని భటులకుఁ బెట్టిన కొరెలఁదియు పనులునుఁగీర్తులు పంతములు అనువులు దప్పును అవి గడమైతే పనివడి యివియే బదుకనీవయ్యా చ. కడుసంపదలును కాలము కొలఁదే బడిబడిఁ జవులై ఫలియించు యెడపక శ్రీవేంకటేశుఁడిచ్చె నివే పడసితి మివియును బదుకనీవయ్యా రేకు: 0334-05 ధన్నాసి సంపుటము:04-200 పల్లవి: నాకుఁ గలపని యిదె నారాయణుఁడ నీవు శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు చ. జలధివంటిది సుమీ చంచలపు నామనసు కల వింద్రియముల నేటిజలచరములు వొలసి భకైనెడి వోడ యొక్కితి నేను జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు చ. కొండవంటిది సుమీ కొనకెక్కు నామనసు వుండుఁ గామాదులను వురుమృగములు వుండి నీశరణమను వూఁత గొని యొక్కితిని కొండలప్ప నీవనేటి కొనఫలముకొరకు చ. టీవులను ధరణివంటిది సుమీ నామనసు నీవె శ్రీవేంకటేశ నిక్షేపము వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి భూవిభుఁడ నీవనేటి పురుషార్ధము వ