పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

662 రేకు: 0358-01 గుండక్రియ సంపుటము: 04-339 పల్లవి: నాఁటకమింతా నవ్వులకే పూఁటకుబూఁటకుఁ బొల్లెపావు చ. కోటివిద్యలునుఁ గూటికొఱకె పో చాటువ మెలఁగేటి శరీరికి తేటల నాఁకలిదీరినపిమ్మట పాటుకుఁ బాటే బయలైపోవు చ. మెఱసేటిదెల్లా మెలుఁతలకొరకే చెఱలదేహములజీవునికి అఱమరపుల సుఖమందినపిమ్మట మొఱఁగుకు మొఱఁగే మొయిలై పోవు చ. అన్ని చదువులును నాతనికొరకే నన్నెరిఁగిన సుజ్ఞానికిని యిన్నిట శ్రీవేంకటేశుదాసునికి వెన్నెలమాయలు విడివడిపోవు రేకు:0015-03 సామంతం సంపుటము: 01-091 పల్లవి: నాఁటికి నాఁడే నా చదువు మాటలాడుచును మఱచేటి చదువు చ. ఎనయ నీతని నెఱుఁగుటకే పో వెనకవారు చదివినచదువు మనసున నీతని మఱచుటకే పో పనివడి యిప్పటిప్రాఢలచదువు చ. తెలిసి యితనినే తెలియుటకే పాశీ తొలుతఁ గృతయుగాదులచదువు కలిగినయినాత్రనిఁ గాదననే పాశీ కలియుగంబులోఁ గలిగినచదువు చ. పరమని వేంకటపతిఁ గనుటకే పో దొరలగు బ్రహ్మాదులచదువు సిరుల నితని మఱచెడికొరకే పాశీ విరసపు జీవులవిద్యలచదువు రేకు:0105–04 సాళంగనాట సంపుటము: 02-028 పల్లవి: నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు నీకరుణ గలిగితే నించి చూపవయ్యా చ. ఘనోరమైన దేహపు దురుణ మేమిగలిగిన ఆరసిఁ బ్రకృతిఁబోయి అడుగవయ్యా నేరని నాజన్మముతో నేరుపేమి గల్లా నన్ను ధారుణిఁ బుట్టించిన విధాత నడుగవయ్యా చ. పంచేంద్రియములలోని పాప మేమి గలిగినా అంచెలఁ గామునిఁబోయి అడుగవయ్యా ముంచిన నాకర్మములో మోసమేమి గలిగినా మంచితనానఁ జేయించే మాయ నడుగవయ్యా చ. అన్నిటా నావెనకటి అపరాధమేమి గల్లా మన్నించి నాగురుఁ జూచి మానవయ్యా మిన్నక శ్రీవేంకటేశ మీఁదిపనులేమి గల్లా నిన్నుఁ జూచుకొని నన్ను నీవే యేలవయ్యా