పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

661 రేకు:0204-06 బౌళి సంపుటము: 03-024 పల్లవి: నవనీత చోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో చ. హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహ వామన నమో నమో మురహర పద్మనాభ ముకుంద గోవింద నరనారాయణరూప నమో నమో చ. నిగమగోచర విషు నీరజాక్ష వాసుదేవ నగధర నందగోప నమో నమో త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరా8) నాయక నమో నమో చ. వైకుంఠరుక్మిణీవల్లభ చక్రధర నాకేశవందిత నమో నమో శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర నాకజనన(???)నుత్ర నమో నమో రేకు: 0331-05 వరాళి సంపుటము:04-182 పల్లవి: నవమూర్తులైనట్టి నరసింహము వీఁడె నవమైన శ్రీకదిరి నరసింహము చ. నగరిలో గద్దెమీఁది నరసింహము వీడె నగుచున్న జ్వాలానరసింహము నగముపై యోగానందనరసింహము వీఁడె మిగుల వేదాద్రి లక్షీనారసింహము చ. నాఁటుకొన్న భార్గవూటునరసింహము వీఁడె నాఁటకపు మట్టెమళ్లనరసింహము నాఁటి యూ కానుగమానినరసింహము వీఁడె మేఁటి వరాహపు లక్షీనారసింహము చ. పొలసి యహోబలాన బొమ్మిరెడ్డిచెర్లలోన నలిరేఁగిన ప్రహ్లాదనరసింహము చెలఁగి కదిరిలోన శ్రీవేంకటాద్రిమీఁద మెలఁగేటి చక్కని లక్షీనారసింహము రేకు:0087-05 సాళంగనాట సంపుటము: 01-427 పల్లవి: నా తప్పులోఁ గొనవే నన్నుఁ గావవే దేవ చేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని చ. అందరిలో నంతర్యామివై నీవుండఁగాను యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి చ. లోకపరిపూర్జుఁడవై లోనా వెలి నుండఁగాను చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని కైకొని యీమాయలు నీకల్పితమై వుండఁగాను చౌకలేక నేవేరే సంకల్పించితిని చ. యొక్కడ చూచిన నీవే యేలికెవై వుండఁగాను యిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేను చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను మెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను