పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

660 రేకు:0223-06 శంకరాభరణం సంపుటము: 03-131 పల్లవి: నలినాక్ష నీకు నమస్కరించిన ఫలము వొగడ నిఁక బ్రహ్మకు వశమా చ. పూర్వదోషములఁ బోఁదోలి మఱియు సర్వాపచారము క్షమియించి గర్విత మదముల కసటు వాపి నను నిర్వహించె నిదె నీనామము చ. నేఁడునుఁ జేసిన నేరము లణఁచి వేఁడి కర్మముల విడిపించి వాఁడి దుఃఖముల పడిఁ బరిహరించె నాఁ డెఱఁగఁగ నీ నామము చ. వుమ్మడి సుఖముల నొనరించీ మాకు సమ్మతి శుభములు జయమొసంగీ యిమ్ముల శ్రీవేంకటేశ్వర యిదివో నెమ్మది రక్షించె నీనామము రేకు: 0329-03 శ్రీరాగం సంపుటము:04-168 పల్లవి: నల్లఁబల్లి చెన్నుఁడు నాపాలిటి వెన్నుఁడు యెల్ల జీవులకు మరి యిన్నిటాఁ బ్రసన్నుడు చ. కమలావరుడు శ్రీకర మదనగురుఁడు సమర దానవకుల సంహారుఁడు విమల గుణాకరుఁడు విజయచక్రధరుఁడు కమనియ్యు భక్తజన కరుణాకరుఁడు చ. వేదాంతవేద్యుఁడు విశ్వహితాపాద్యుఁడు ఆదియునంత్యములేని యనవద్యుఁడు సాదితయోగిహృద్యుఁడు శమితోగ్రవైద్యుఁడు సోదించి చూచితేను సురలకు నాద్యుఁడు చ. కామితఫల శక్తుఁడు ఘనమహిమ యుక్తుఁడు ఆముకొన్న లోకరక్షణ సక్తుఁడు నేమాన శ్రీవేంకటాద్రి నిలిచి మమ్మేలినాఁడు కోమలుఁడు వీఁడిగో గోపకాస రక్తుఁడు రేకు:0092-01 నాట సంపుటము: 01-453 పల్లవి: నవనారసింహ నమో నమో భవనాశితీర యహోబలనారసింహ చ. సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ విత్రతవీరసింహవిదారాణా అత్రిశయుకరుణ యోగానంద నరసింహ మతి శాంతపు కానుగుమాని నారసింహ చ. మరలి బీభత్సపుమట్టెమళ్ల నరసింహ నరహరి భార్లోటి నారసింహ పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ సిరుల నద్భుతపు లక్ష్మీనారసింహ చ. వదనభయూనకపు వరాహ నరసింహ చెదరని వైభవాల శ్రీనరసింహ అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి పదివేలురూపముల బహునారసింహ