పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

659 రేకు: 0197-02 సాళంగనాట సంపుటము: 02-497 పల్లవి: నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక ధరణిఁ గీరితికెక్కె దశరథసుతుఁడు చ. యీతఁడాతాటకిఁ జంపె నీమారీచసుబాహుల నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె సీతఁ బెండ్లియాడెను యీచిన్నరాముఁడా చ. చుప్పనాతిముక్కు గోసి సోదించి దైత్యులఁ జంపి అప్పుడిట్టె వాలి నేసినాతఁ డీతఁడా గుప్పించి కోఁతుల నేలి కొండల జలధి గట్టి కప్పి లంక సాధించె నీకౌసల్యనందఁనుడా చ. రావణాదులనుఁ జంపి రక్షించి విభీషణుని భావించయోధ్య నీతఁడు పట్టమేలెను శ్రీవేంకటేశుఁడితఁడే సృష్టి రక్షించె నితఁడే యీవల మూపాలనున్న యీరామచంద్రుఁడా రేకు: 0353–02 ముఖారి సంపుటము: 04–310 పల్లవి: నరులార నేఁడువో నారసింహజయంతి సురలకు నానందమై శుభములొసంగెను చ. సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార - మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద కందువ గోళ్ళఁ జించెఁ గనక కశిపుని చ. నరమృగరూపము నానా హస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమఁ బ్రహ్లాదునిఁ గాచిరక్షించి నిలిచె గురుతర బ్రహ్మాండ గుహలోనను చ. కాంచనపు గద్దె మీఁద గక్కనఁ గొలువై యుండి మించుగ నిందిరఁ దొడమీఁద బెట్టుక అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై వంచనసేయక మంచివరాలిచ్చీనదివో రేకు: 0388-01 రామక్రియ సంపుటము: 04-510 పల్లవి: నరులాల మునులాల నానా దేవతలాల పరబ్రహ్మ మీతఁడే ప్రత్యక్షమై వున్నాఁడు చ. భావించి చూడరో వీఁడె ప్రపద వరదుఁడు సేవించరో తొడమీఁది శ్రీ సతిని వావిలి నుతించరో వరశంఖచక్రాలవె కోవిదుఁడు గద్దెమీఁదఁ గొలువై వున్నాఁడు చ. చెలఁగి మొక్కరో వీఁడె శ్రీ నరసింహ దేవుఁడు తెలియరో యియాత్రని తేజోరూపము అలరి పూజించరో అనంతహస్తము లవె కొలఁది మీరి విష్ణుఁడు కొలువై వున్నాఁడు చ. యిదె శరణనరో హిరణ్యదైత్యహరుని అదన జపించరో యినా హరినామము యెదుట శ్రీ వేంకటాద్రిని యహోబలమునందు కొదలే కాదిమూరితి కొలువై వున్నాఁడు