పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

666 రేకు: 0067-01 ఆహిరి సంపుటము: 01-346 పల్లవి: నానాదిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు గదలి చ. సతులు సుతులుఁ బరిసరులు బాంధవులు హితులు గిరెలువఁగా నిందరును శతసహస్రయోజనవాసులు సువ్రతములతోడనె వత్తురు గదలి చ. ముడుపులు జాజైలు మొగిఁదల మూఁటలు కడలేనిధనముఁ గాంతలును కడుముOచిమణులు కరులుఁ దురగములు వడిగొని చెలఁగుచు వత్తురు గదలి చ. మగుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులుఁ జతురులును తగువేంకటపతి దరుశింపఁగ బహు వగలసంపదల వత్తురు గదలి రేకు:0192-02 సాళంగం సంపుటము: 02-469 పల్లవి: నానాభక్తులివి నరుల మార్గములు యే నెపాననైనా నాతఁ డియ్యకొను భక్తి చ. హరిఁకిఁగా వాదించు టది ఉన్మాదభక్తి పరులఁ గొలువకుంటే పతివ్రతాభక్తి అరసి యాత్మఁ గనుటదియే విజ్ఞానభక్తి అరమరచి చొక్కుటే ఆనందభక్తి చ. అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి ఆతని దాసుల సేవే అదియే తురీయభక్తి క్షితి నొకపని గోరి చేసుటే తామసభక్తి అతఁడే గతని వుండుటది వైరాగ్యభక్తి చ. అట్టె స్వతంత్రుఁడౌటే అది రాజసభక్తి నెట్టన శరణనుటే నిర్మలభక్తి గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి తట్టుముట్టులేనిదే తగనిజభక్తి రేకు:0289-02 సామంతం సంపుటము: 03-513 పల్లవి: నానాభరణముల నరసింహా పూనిన ప్రతాపముల నరసింహా చ. నగవుల నెమ్మోము నరసింహా పొగరుమించు టూర్పుల నరసింహా నగముమీఁది ఘన నరసింహా తగుకాంతుల యందపు నరసింహా చ. నలిననేత్ర శ్రీనరసింహా పారెలుపారెందు నఖంబుల నరసింహా నలుదెసల మెఱయు నరసింహా వెలయు మూఁడుగన్నుల నరసింహా చ. నమిత్ర సురాసుర నరసింహా కమనియ్యగుణాకర నరసింహా నమోస్తు తే శుభ నరసింహా కమలాంక శ్రీవేంకటనరసింహా