పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

655 రేకు:0044-02 శుద్దవసంతం సంపుటము:01-269 పల్లవి: నమో నారాయణాయ నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో చ. నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి పత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యయ పత్యక్షాయ సన్మానససాOగత్యాయ జగదవనకృత్యాయ తేనమో చ. అక్రమోద్దతబాహువిక్రమాతిక్రాంత శుక్రశిష్యోన్యూలనక్రమాయ శక్రాదిగీర్వాణవక్రభయభంగనిర్వక్రాయ నిహతారిచక్రాయ తేనమో చ. అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ కాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసంరక్షానుకంపాకటాక్షాయ తేనమో చ. కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందుకోటీరతరుణీ మనస్తోత్రపరితోషచిత్తాయ పరమాయ తే నమో చ. పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ ధాత్రీశకామితార్ధప్రదాయ గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నారయణాయ రేకు:0116–06 దేసాక్షి సంపుటము: 02-096 పల్లవి: నమ్మలేము కానలేము నరులాల మనమింతే సమ్మతించి యేలేవాఁడు సర్వేశుఁడే సుండీ చ. కంటికిఁ గంటిరెప్ప కాచుకవుండినయట్టు వొంటి దేహమెల్లా జేవొడ్డుకొన్నట్టు అంటుక దేహి నేపొద్దు అంతరాత్మయై వుండీ జంటయె కాచుకున్నాఁడు సర్వేశుఁడే సుండీ చ. చీఁకటి నోటికిఁ గడి చేయే కొంటవచ్చినట్టు ఆఁకటికి గుక్కిళ్లు ఆసయినట్టు వీఁకల జంతువులకు వెలుపల లోననుండి సాఁకుచునున్నాఁ డిదివో సర్వేశుఁడే సుండీ చ. తమదేహ మెంతైనా తానే యింపయి మోచినట్టు తెమలి ప్రాణ మిన్నిటాఁ దీపంునట్టు అమరిన భోగమోక్షా లడిగినవారి కిచ్చీ సముఁడు శ్రీవేంకటాద్రి సర్వేశుఁడే సుండీ