పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

654 రేకు:0171-05 బౌళిరామక్రియ సంపుటము: 02-348 పల్లవి: నమో నమో లక్షీనరసింహా నమో నమో సుగ్రీవనరసింహా చ. వరద సులభ భక్త వత్సల నరసింహా నరమృగవేష శ్రీనరసింహా పరమపురుష సర్వపరిపూర్ణ నరసింహా గిరిగుహావాస సుగ్రీవనరసింహా చ. భయహర ప్రపదపాలన నరసింహా నయనత్రయూరవింద నరసింహా జయ జయ సురమునిసంస్తుత నరసింహా క్రియాకలాప సుగ్రీవనరసింహా చ. అతికృపానిలయ మోహనరూప నరసింహా నత పితామహముఖ్య నరసింహా సతత శ్రీవేంకటేశ్వర దివ్యనరసింహా కితవారిభంజన సుగ్రీవనరసింహా రేకు:0235-02 లలిత సంపుటము: 03-199 పల్లవి: నమో నారాయణ నా విన్నప మిదివో సమానుఁడఁగాను నీకు సర్వేశ రక్షించవే చ. మనసు నీ యాధీనము మాటలు నీ వాడేటివే తనువు నీపుట్టించిన ధన మిది మును నీపంపున నిన్ని మోచుకున్నవాఁడ నింతే వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే చ. భోగములెల్లా నీవి బుద్దులు నీవిచ్చినవి యీగతి నాబతుకు నీ విరవైనది చేగదేర నీవు నన్నుఁ జేసిన మానిసి నింతే సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే చ. వెలి నీవే లో నీవే వేడుక లెల్లా నీవే కలకాలమును నీకరుణే నాకు యిల శ్రీవేంకటేశ నీవేలుకొన్నబంట నింతే నెలవు దప్పించక నీవే రక్షించవే రేకు:0040-03 శ్రీరాగం సంపుటము: 01-245 పల్లవి: నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ చ. ధరణీసతీఘనస్తనశైలపరిరంభపరిమళశ్రమజలప్రమదాయ సరసిజనివాసినీసరసప్రణామయుతచరణాయ తే నమో సకలాత్మకాయ చ. సత్యభామాముఖాంచనపత్రవల్లికా నిత్యరచనక్రియానిపుణాయ కాత్యాయనీస్తోత్రకామాయ తే నమో ప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ చ. దేవతాధిపముకుటదివ్యరత్నాంశుసం భావిత్రాములపాదపంకజాయ కైవల్యకామినీకాంతాయ తే నమో శ్రీవేంకటాచల శ్రీనివాసాయ