పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

653 రేకు: 0325-03 బౌళి సంపుటము:04-144 పల్లవి: నమో నమో దశరధనందన రామ కమనియ్యు యాగభాగకర్త రామ చ. కాకుత్సకుల రామ కౌసల్యాసుత రామ శ్రీకరగుణోన్నత శ్రీరామ కాకాసురవైరి రామ కౌశికవత్సల రామ జలీకరతాటకాంత్రకబురుద రామ చ. వాలిథిబంధన రామ వాలిపూరణ రామ చారుహరకోదండభంజన రామ ధారుణీజపతి రామదశకంఠహర రామ సారవిభీషణా భీషేచన రామ చ. అమరపాలిత రామ అయోధ్యాపతి రామ సమరకోవిద రామ సర్వజ్ఞ రామ విమల రామ శ్రీవేంకటగిరి రామ రమణ శరణాగతరక్షక రామ రేకు:0249-05 సాళంగనాట సంపుటము: 03-282 పల్లవి: నమో నమో దానవవినాశ చక్రమా సమరవిజయమైన సర్వేశు చక్రమా చ. అట్టే పదారుభుజాల నమరిన చక్రమా పట్టినాయుధముల బలుచక్రమా నెట్టన మూఁడుగన్నుల నిలిచిన చక్రమా అట్టుగా మన్నించవే మెఱయుచు చక్రమా చ. ఆరయ నారుగోణాల నమలిన చక్రమూ ధారలు వేయిటితోడి తగు చక్రమా ఆరక మీఁదికి వెళ్లే అగ్నిశిఖల చక్రమా గారవాన నీ దాసులఁ గావవే చక్రమా చ. రవిచంద్రకోటితేజరాసియైన చక్రమా దివిజసేవితమైన దివ్య చక్రమా తవిలి శ్రీవేంకటేశు దక్షిణకర చక్రమా యివల నీదాసులము యేలుకోవే చక్రమా రేకు: 0381-02 బౌళి సంపుటము:04-471 పల్లవి: నమో నమో రఘు కుల నాయక దివజ వంద్య నమో నమో శంకర నగజనుత్రా చ. విహిత ధర్మపాలక వీర దశరథ రామ గహనవాసినీ తాటకా మర్దన అహల్యా శాపమోచన అసుర కుల భంజన సహజ విశ్వామిత్ర సవన రక్షకా చ. హరి కోదండహర సీతాంగనా వల్లభ ఖరదూషణారి వాలిగర్వాపహా త్రరణి త్రనూజాది త్రరుచర పాలక శరధి లంఘన కృత సౌమిత్రి సమేతా చ. బిరుద రావణ శిరో భేదక విభీషణవరద సాకేత పుర వాస రాఘవ నిరుపమ శ్రీ వేంకేటనిలయ విజనగర పురవరవిహార పుండరీకాక్షా