పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

652 రేకు:0289-03 శంకరాభరణం సంపుటము: 03-514 పల్లవి: నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం చ. విజయ నరసింహం వీర నరసింహం భుజబలపరాక్రమస్ఫుట నృసింహం రజనీచరవిదళనవిరాజిత నృసింహం సుజనరక్షక మహాశూర నరసింహం చ. దారుణనృసింహం ప్రతాప నరసింహం చారుకల్యాణ నిశ్చల నృసింహం ధీరచిత్తావాస దివ్య నరసింహం సారయాగానందచత్రుర నరసింహం చ. విమల నరసింహం విక్రమ నృసింహం కమనియ్యగుణగణాకర నృసింహం అమితసుశ్రీవేంకటాద్రి నరసింహం రమణియ్యభూషాభిరామ నరసింహం రేకు: 0385-03 లలిత సంపుటము:04-494 పల్లవి: నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుత అసద్విఖ్యాతకీర్తే చ. రామ రఘువర సిత రాజీవ లోచన భూమిజా రమణ త్రిభువన విజయ కోమలాంగ శ్యామ కోవిద రణరంగ భీమ విక్రమ సత్యబిరుద ప్రవీణ చ. దళిత దైతేయ కోదండ దీక్షాదక్ష జలజాప్తకుల విభీషణ రక్షక కలిత దశరథ తనయ కౌసల్యానంద సులభ వానర ముఖ్య సుగ్రీవ వరద చ. చారులక్ష్మణ భరత శత్రఘ్నుపూర్వజ తారక బ్రహ్మ నిత్య స్వరూప ధీర శ్రీ వేంకటాధిప భక్తవత్సల భూరిగుణ సాకేత పుర నివాసా రేకు:0351-05 మాళవశ్రీ సంపుటము: 04-301 పల్లవి: నమో నమో దశరథనందన మమ్మురక్షించు కమనీయ శరణాగతవజ్రపంజరా చ. కోదండదీక్షాగరుఁడ రామచంద్ర ఆదిత్యకుల దివ్యాస్త్రవేది సాదించుమారీచునితలగుండుగండ ఆదినారాయణ యుసురభOజనా చ. ఖరదూషణ శిరఃఖండన ప్రతాప శరధిబంధన విభషణవరదా అరయ విశ్వామిత్రయాగసంరక్షణ ధరలోన రావణదర్పాపహరణ చ. పొలుపొంద నయోధ్యపుర వరాధీశ్వర గెలుపుమీరిన జానకీరమణ అలఘుసుగ్రీవాంగదాది కపిసేవిత సలలిత శ్రీవేంకటశైలనివాసా