పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

651 రేకు:0278-03 బౌళి సంపుటము: 03-449 పల్లవి: నన్నెంచం బనిలేదు నిన్నెంచుటే కాని మన్నించు హరి నీ మఱఁగు చొచ్చితిని చ. రాజుఁ బెండ్లాడిన యట్టి రమణి యేజాతైనా పూజితమై యిన్నిటాను భోగించినట్టు సాజాన నే నెంత సకలహీనుఁడనైనా వోజతో నిన్నుఁ గొలిచి వున్నతుఁడనైతిని చ. వేల ముదుటంగరము వేడుకనిడి ప్రధాని కేలెత్తి యిందరిచే మొక్కించుకొన్నట్టు నేలనే నీ ముద్ర మోచి నే నేఁటివాఁడనైనా పేలరి జగములోనఁ బెద్దనైతి నిదివో చ. తల్లిదండ్రి గలవాఁడు తప్పలేమైనాఁ జేసి తల్లితో ముద్దుగునిసి తప్పించినట్టు చల్లని శ్రీవేంకటేశ సరవి నీ కృపవల్ల కెల్లున నిన్నునుతించి గెలిచితి నిదివో రేకు:0185-02 కాంబోది సంపుటము: 02-427 పల్లవి: నన్నెరఁగలేనయ్యో నాయంతర్యామై వున్నతపు హరి నాలో నున్నాఁడట చ. యిల నేడుజానల మేనిందులోనివాఁడ నింతే తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపాయిన్యాని కలువరేకులంతేసి కన్నులవాఁడ వింతే సాలసి చూపాకాశమే చూరగొనీని చ. వెడ వెంట్రుక దూరేటి వీనులవాఁడ నింతే కడలేని శబ్దము లొక్కట వినేను నడుమ నే నల్లెఁడంత నాలికెవాఁడ నింతె వుడివోని సుద్దు లెల్లా నుగ్గడించేను చ. లచ్చనఁ బదారంగుళాల ప్రాణ మింతే కుచ్చి కాలపుదినాలు గొలచీని కొచ్చిన శ్రీవేంకటేశు కొలువుడుబంట నింతే పచ్చి యింద్రియాల కెల్లాఁ బంపు సేసేను పె.అ.రేకు:0028-02 సాళంగనాట సంపుటము: 15-160 పల్లవి: నమామ్యహం మానవసింహం ప్రమదాఁక మహోబల నరసింహం చ. దానవదైత్య విదారణసింహం నానాయుధకర నరసింహం భూనభోంతరాపూరిత సింహం ఆనన వహ్నిలయాంతక సింహం చ. ప్రళయ నృసింహం బహు ముఖ సింహం సలలిత్ర గరుడాచల సింహం కులిశనఖర ముఖ ఘరోషిత సింహం త్రిలకిత్ర బహురవి దీపిత్ర సింహం చ. శాంత నృసింహం శౌర్య నృసింహం సంతత్ర కరుణాజయ సింహం కాంతం శ్రీ వేంకటగిరి సింహం చింతతఘన సంసిద్ధి నృసింహం