పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

650 పె.అ.రేకు:0013-05 బౌళి సంపుటము: 15-072 పల్లవి: నన్ను నేనే ఆహహా నవ్వుకొనవలదా యిన్ని వెలుతుల నేను యెదురి నాడేదుట చ. చేరి దిగంబరి యట చీరల దిండ్లటా సారెను విరత్రి యుట సంసార మటూ పేరు మౌనవ్రతి యట బిరుదువాదము లటా యీరీతి నే దొర నట యిందరి వేఁడేదటా చ. చప్పిడయ్యఁగా రట వుప్పపెరికలు నట గొప్పయిన తపసి నట కొలువూ నట అప్పటి నిరాహారి నట ఆరంభము లట చిప్పిలి మనసు ముడి సింగారా లట చ. పెంపు జతేంద్రియుఁడట పెండ్లి శోభనమట ముంపున మోక్షార్థి యట లంపటమట యింపుల శ్రీవేంకటేశ యిన్నిభావములఁ బొంది తెంపున నీ శరణని తెలిసితి నటా రేకు: 9074-02 ఆహిరి సంపుటము: 04-575 పల్లవి: నన్నునింత సేయుకంటె నవ్వులున్నవా పంట మన్నుపైఁడిముద్దగాఁగ మన్నుపూసె నితఁడు చ. పంచమహాపాతకులఁ బరమపావనుల(గా వించఁ బూనె నిందుకంటె విద్యలున్నవా ఇంచుకంత హరినామమింతలోననె ముట్టు పెంచు దెచ్చి మాణికపుబిల్ల సేసె నితఁడు చ. మాలవాని కష్టవిద్య మందవెట్టి బ్రహ్మవిద్య పాలు సేసె నిందుకంటె బ్రతుకున్నదా నాలుకందునున్న విషునామమంత్రము చెప్పు తోలుబిల్ల మాడకంటె దొడ్డసేసె నన్నును చ. కుక్క దెచ్చి గంగిగోవు కొదమగాఁగ భూమిలోన ఒక్కమాట యింతసేయ నోపవచ్చునా దిక్కులందు వేంకటేశు దివ్యనామము రోఁత కక్కుఁగూటి నమృతజలధిఁ గావించె నన్నును పె.అ.రేకు:0003-01 దేసాళం సంపుటము: 15-014 పల్లవి: నన్నునింతగా గడించి నాయమా దిగవిడువ అన్నిటా రక్షించుకోవె అంతర్యామీ చ. సామ్మ వోవేసినవాఁడు చుట్టి చుట్టి వీధులెల్లా కమ్మర వెదకీనట కన్న దాఁకాను నమ్మిన ఆజ్ఞానములో నన్నుఁ బడ వేసికొని అమ్మరో వూరకుందురా అంతర్యామీ చ. వోడబేరమాడేవాఁడు వొక్కదరి చేరిచి కూడిన యర్ధము గాచికొనీనట యీడనే ప్రపంచములో యిట్టే నన్ను దరి చేర్చి వోడక కావఁగరాదా వోయంతర్యామీ చ. చేరి వుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట వూరకే శ్రీ వేంకటేశ వోపికతోడ ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నా భార మేరీతినైన మోవు మింక నంతర్యామీ