పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

649 పె.అ.రేకు: 0039-06 గుండక్రియ సంపుటము: 15-224 పల్లవి: నన్ను నిన్ను నెంచుకోవో నారాయణా అన్నియు నీ చేతినే అదివో నారాయణా చ. నా మన సెఱుఁగవా నారాయణా నేఁడు నాము లాయో వయసులు నారాయణా నామధారికపు మొక్కు నారాయణా ఆముకొని నీ ప్రియము లందునే నారాయణా చ. నగుతా నే నంటి నింతే నారాయణా యిదె నగ రెఱిఁగినపని నారాయణా నగవులు మూకుఁ జాలు నారాయణా అగడు సేయకు మిఁక నప్పటి నారాయణా చ. ననలు నీ వినయాలు నారాయణా, మంచి నను పంటి మిదివో నారాయణా ఘనుఁడ శ్రీవేంకటాద్రిఁగలసితి విట్లేనను అనుమాన మెల్లఁ బాసె నందు నారాయణా పె.అ.రేకు : 0036-03 మలహరి సంపుటము: 15-203 పల్లవి: నన్ను నెంచుకొన నయ్యా నగుఁబాట్ల నేను కన్నవారి విన్నవారిఁ గాకు సేసేనే చ. మలసి నా గుణములు మంచివై నప్పుడు గదా యెలమి నెదిరి నేరము లెంచేది చెలఁగి నే పాపములు సేయకుండె మరి కదా తొలఁగి పరుల నే దూషించేది చ. నడవడి నే లెన్స నడిచినప్పుడు గదా పొడవైయన్యులకు నే బుద్ధి చెప్పేది వెడఁగై యితరుల నే వేఁడనియప్పడు గదా కడవారి విరక్తి గాదనేది చ. కామినుల సంగమము కాదని నే మరి కదా నేమమై యితరుల నే నిందించేది నామదిలో నన్ను నేను నవ్వుకొని సిగ్గుపడి నీ మఱఁగు చొచ్చితి నేఁడు శ్రీ వేంకటేశ రేకు: 0213-02 బౌళి సంపుటము: 03-074 పల్లవి: నన్ను నెవ్వరు గాచేరు నాఁటి పగెంతురుఁ గాక నిన్న నేఁడీ రోఁతలైతే నీతి యానా నాకును చ. దేవుఁడ నేనే యంటా తిరిగే నాస్తికుఁడనా దేవతలకు మొక్కఁబోతే నిఁక నగరా కావించి యింద్రియములే గతెని యిన్నాళ్లు నుండి ఆవల జితేంద్రియుఁడనంటే నవి నగవా చ. కర్మము దొల్లి సేయక కడుదూరమై ఇఁక నా కర్మము సేయఁగఁబోతే కర్మమే నగదా దుర్మతి సంపారినై(???) తొయ్యలులకు మోహించి అర్మిలి దూషించితేను అట్టె వారు నగరా చ. నేనే స్వతంత్రుఁడనంటా నిండుదానాలెల్ల మాని పూని యిఁకఁ జేయఁబోతే పొంచి యవి నగవా నేనిన్నిటా సిగ్గుపడి నీ మరఁగు చొచ్చితిని ఆనుకొని శ్రీవేంకటాధిపుఁడ కావవే