పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

648 రేకు:0142-05 భైరవి సంపుటము:02-187 పల్లవి: ననుఁ జూచి హరి నీవు నవ్వకుండేవా పనిమాలెంత బయలుపాకీ నామనసు చ. మనసుకు గోచరమూ మాటలకు గోచరమూ కనుఁగొన వసమా నీఘనరూపము నిను వెదకుచున్నాఁడ నీవెక్కడ నే నెక్కడ జనుఁడ నిOతె యోంత్ర సాహసము నాది చ. వున్నచో టెఱుఁగుదునా వోయినా అంటేఁ బలికేవా యెన్ని తెలియఁ దరమా యిట్టి నీమాయ అన్నిటా నీకొలువు సేయఁ గడఁగుచున్నవాఁడ యెన్నటిపొందు నీవు నాకెంత దిట్టతనమో చ. వాకిలి గానవచ్చునా వంచించి చొరవచ్చునా రాకపోక కబ్బునా పరమపదము శ్రీకాంతుఁడ ప్రత్యక్షమై శ్రీవేంకటాద్రి యిదె కైకొంటి నీకృప నెంత గట్టువాయతనమో పె.అ.రేకు:0055-03 రామక్రియసంపుటము: 15-313 పల్లవి: ననుఁ దెలుపఁ గదవే నారాయణ నీ మహిమ జనయంతి యని చాటుచు నున్నది చ. తలపాగీసి చూడ మొదలఁ బ్రకృతి జడము యెలమితో గుణత్రయ మేల వచ్చెను మలసి యందరికిని మనసై నిలువ నేలఁ యిల నింద్రియవ్యాపార మేమిటికి చ. ప్రకృతి జడమైతే బహుభాష లు రా నేల అకట సంసారభోగ మది గా నేల ప్రకటించి బ్రహ్మదులపట్టము గానేల సకలధర్మాధర్మస్వరూప మెట్టాయ చ. జడమైన ప్రకృతికి జన్మపరంపర లేల అడియూలాలందు నందు నదెట్టెఱిఁగె యెడ చొచ్చీని ప్రేరణ లన్నిటానని యెంచితే విడివి శ్రీవేంకటేశ నీవు నిప్ర్కియుఁడవు రేకు:0107-03 కన్నడగౌళ సంపుటము: 02-039 పల్లవి: నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ అన్నిటా రక్షించకపో దంతర్యామి చ. సామ్మవో వేసినవాఁడు చుట్టిచుట్టి వీథులెల్లా కమ్ముక వెదకీనట కన్నదాఁకాను నమ్మిన అజ్ఞానములో నన్నుఁ బడవేసుకొని అమ్మరో వూరకుందురా అంతర్యామి చ. వోడ బేరమాడేవాఁడు వొకదరి చేరిచి కూడిన యర్ధము గాచుకొనీనట యీడనే ప్రపంచములో నిట్టె నన్ను దరిచేర్చి వోడక కాచుకోరాదా వో యంతర్యామి చ. చేరి పుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట వూరకే శ్రీవేంకటేశ వోపికతోడ ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవునాభారమేరీతినైన మోపు మిఁక సంతర్యామి