పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

647 రేకు: 0374-03 శోకవరాళి సంపుటము: 04–434 పల్లవి: నడవరోజడియక నవ్యమార్గమిది మడుఁగిది వైష్ణవమార్గమిది చ. ఘనశుకముఖ్యులు గన్న మార్గమిది జనకాదులు నిశ్చలమార్గమిది సనత్కుమాఁరుడుజరపుమార్గమిది మనువుల వైష్ణవమార్గమిది చ. నలుగడ వసిషు నడుచు మార్గమిది యిల వేదవ్యాసుల మార్గం బిది బలిమిగలుగు ధ్రువ పట్టపు మార్గము మలసిన వైష్ణవ మార్గమిది చ. పరమమార్గం బిదే ప్రపంచమార్గము గురుమార్గం బిడె గోప్య మిదే గరిమెల శ్రీ వేంకటపతి మాకును మరిపెను వైష్ణవమార్గ మిదే రేకు:0259-06 శ్రీరాగం సంపుటము: 03-342 పల్లవి: నడుమ రెంటికిని నా మేను వడఁబడె యెందలివాఁడనొ నేను చ. కంటిమి జగమిది కన్నుల యెదుటను అంటి యిదియు నిజమనరాదు వింటిమి స్వర్గము వేరే కలదని కంటగించి అది గాదనరాదు చ. కట్టుకొంటి మిదె ఘనసంసారము గట్టిగ నిఁకఁ దొరెలఁగఁగరాదు పట్టుకొంటి మిదె పాపపుణ్యములు తెట్టదెరువుననె దించాలేము చ. నగితి నొక సెలవి నానాఁటి బదుకు మొగి నొకచే నిను మొక్కితిని అగపడె శ్రీవేంకటాధిప నీకృప నిగుడి గురుచే నినుఁ గనఁగలిగె రేకు:0008-03 ముఖారి సంపుటము: 01-051 పల్లవి: నదు లొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము చ. ఇరువంకల నీయేచినముద్రలు ధరియించుటే నాస్నానము ధరపై నీనిజదాసులదాసులచరణధూళి నాస్నానము చ. తలఁపులోన నినుఁదలఁచినవారలఁ దలఁచుటే నాస్నానము వలనుగ నినుఁగనువారల శ్రీపాదజలములే నాస్నానము చ. పరమభాగవతపాదాOబుజముల దరుశనమే నాస్నానము త్రిరువేంకటాగిరిదేవ నీకధా స్మరణమే నాస్నానము