పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

646 రేకు: 0354-03 లలిత సంపుటము:04-317 పల్లవి: నటనల భ్రమయకు నామనసా ఘటియించుహరియే కలవాఁడు చ. ముంచిన జగమిది మోహినీగజము పొంచినయాస పుట్టించే దిది వంచనల నిజమువలెనే వుండును మంచులు మాయలే మారునాఁడు చ. సలి సంసారము సంత్రలకూటమి సారిదిఁ బచారము చూపే దిది గరిమ నెప్పుడుఁ గలకలమనుచుండును మరులగువిధమే మాపటికి చ. కందువదేహము గాని ముదియదిది అందినబహురూప మాడేదిది యెందును శ్రీవేంకటేశ్వరుఁడుండును డిందుపడఁగనిదె తెరమరఁగు పె.అ.రేకు: 0038-05 ముఖారి సంపుటము: 15-217 పల్లవి: నడచీ లోకము బ్రహ్మనాఁటనుండి సహజము యొడయక శరణని యియ్యకొంటి సుఖము చ. ఉదయాస్తమయములు వొక రన్నట్టయ్యినా చెదరి మేలునుఁ గీడు చెప్పినట్టు సేసీనా యిది దైవకల్పితము యెవ్వరి నేమన వచ్చు కదిసి యైనది యయిన్యా కాని దెన్నఁడుఁగాదు చ. జననములు మరణములు జంతువుల యిచ్చలా వొనర కలిమిలేము లొక రన్న దౌనా ఘనమైన హరిమాయకల్పితము లివి తొల్లె పొనిఁగి పొయ్యే లీఁ బోవు పోని వెన్నఁడుఁ బోవు చ. శ్రీవేంకటేశ నీవు సేసినసేఁత్రలోన భావించి తెలియలేక భ్రమసితి మిన్నాళ్ళు సావదానమున నిందు శరణంటిమి నీకు యేవేళ మమ్ముఁ గాచితి విన్నిటా గెలిచితివి రేకు:0274-06 కన్నడగౌళ సంపుటము: 03-429 పల్లవి: నడపే వేఁటికి నాటకము అడరి నిజముగా నానతి యీవే చ. విశ్వమూర్తి కొక విన్నపము శాశ్వతములాయ జగములివి యీశ్వరేశ్వరున కింకొక విన్నపము ఐశ్వర్యమోక్షం బాత్మలకేది చ. రమాధిపతి కొక రహస్యము సమానుఁడవు నీవు సర్వమున క్రమాన నిఁక నొక రహస్యము సమోహి (?) నరకము స్వర్గము నేలా చ. హరి నే నొకమాంటడిగెదను నిరంతరాత్మవు నీవుగదే యిరవుగ శ్రీవేంకటేశ నే నడిగెద విరసము లేదిఁక విచార మేలా