పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

645 రేకు:0009-02 ముఖారి సంపుటము: 01-056 పల్లవి: నగుఁబాట్లఁ బడేనాజిహ్వ పగటున నిదివో పావనమూయ చ. ఇల నిOదలి నుత్రిOుOచి పెంచువలె నలినలియైనది నా జిహ్వ నలినోదరుశ్రీనామము దలఁచినఫలమున కిదివో పావనమాయ చ. భ్రమఁబడి మాయపు పడఁతులతమ్మలు నమలి చవులుగొనె నాజిహ్వ అమరవంద్యుఁడగుహరి నుతియించఁగ ప్రమదము చవిగొని పావనమాయ చ. నెలఁతలపలు యోనిద్రవనదులను నలుగడ నీఁదెను నాజిహ్వ అలసి వేంకటనగాధిపయనుచును పలికినయంతనె పావనమూయ రేకు:0224-04 శుద్ధవసంతం సంపుటము:03-135 పల్లవి: నగుఁబాట్లకు లోనై నడచుఁగాక అగపడి పరసుఖమందఁబోయినానా చ. కడిగేది వొకచేత కష్టమే దినదినము కుడిచేది వొకచేతఁగోరినవెల్లా యెడయక తన సిగ్గు యెరఁగని యీ దేహి అడరి హరిమహిమల వెరిఁగీనా చ. వొద్దనుండి రాతిరెల్లా వొడలేమి నెరఁగఁడు పొద్దు వొడచినమీఁద భోగమే కోరు కొద్దిమాలినట్టి తనఘనోరము విచారించఁడు సుద్దులైన హరిభక్తి సోదించీనా చ. అనుభవించేది నిచ్చా నంగనల మాంసమే అనిశము సేయఁబొయ్యే వాచారములే తనివోక మనసులో తనవెట్టి గానఁడు ఘనుఁడు శ్రీవేంకటేశుఁ గానబొయిన్యానా రేకు:0086-05 మాళవి సంపుటము: 01-421 పల్లవి: నగుమొగముతోడి వో నరకేసరి నగరూప గరుడాద్రి నరకేసరి చ. అమితదానవహరణ ఆదినరకేసరి నమితబ్రహ్మాదిసుర నరకేసరి కమలాగ్రవామాంక కనకనరకేసరి నమోనమో పరమేశ నరకేసరి చ. రవిచంద్రశిఖనేత్ర రౌద్రనరకేసరి నవనారసింహ నమో నరకేసరి భవనాశినీతీరభవ్య నరకేసరి నవరసాలంకార నరకేసరి చ. శరణాగతత్రాణ సౌమ్య నరకేసరి నరకమోచననామ నరకేసరి హరి నమో శ్రీవేంకటాద్రి నరకేసరి నరసింహ జయ జయతు నరకేసరి