పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

644 రేకు:0178-02 బౌళి సంపుటము:02-387 పల్లవి: నందగోపనందనుడే నాఁటి బాలుడు ఇందు నేఁడే రేపల్లె నేచి పెరిగేను చ. పువ్వువంటి మట్టియాకుపొత్తిఁ బవళించనేర్చె యెవ్వఁడోకాని తొల్లె యీబాలుఁడు మువ్వంకవేదములను ముద్దుమాట లాడనేర్చె యెవ్వరూఁ గొంత నేర్పనేఁటికే వీనికి చ. తప్పటడుగు లిడఁగనేర్చె ధరణియందు నాకసమున నెప్పగా రసాతలమున నొంటి తొల్లియే రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁ జెంద్రునందు పగలు గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేఁటికే చ. మంచివెన్నబువ్వ లిపుడు మలసి యూరగించనేర్చె నంచితముగ శ్రీవేంకటాద్రిమీఁదను యెంచి యప్పలప్పలనుచు యొనసి కాఁగిలించనేర్చె దించరాని వురముమీఁద దివ్యకాంతను రేకు:0042-05 సామంతం సంపుటము: 01-259 పల్లవి: నగధర నందగోప నరసింహ వో నగజవరద శ్రీ నారసింహ చ. నరసింహ పరంజోతి నరసింహా వీర నరసింహ లక్షీనారసింహా నరసఖ బహుముఖ నారసింహా వోనరకాంతక జేజే నారసింహా చ. నమో నమో పుండరీకనారసింహ వో నమిత్రసురాసురనారసింహా నమకచమకహిత్ర నారసింహ వో నముచిసూదనవంద్య నారసింహా చ. నవరసాలంకార నారసింహా వో ననీత్రచోర శ్రీనారసింహా నవగుణివేంకటానారసింహా వోనవమూర్తి మండేము నారసింహ రేకు: 0360-03 ముఖారి సంపుటము:04-353 పల్లవి: నగవులు నిజమని నమ్మేదా వొగి నడియాసలు వొద్దనవే చ. తొల్లిటికర్మము దొంతుల నుండఁగ చెల్లబో యిఁకఁజేసేదా యెల్లలోకములు యేలేటి దేవుఁడ వొల్లనొల్ల నిఁక నొద్దనవే చ. పాయినజన్మము పొరుగులనుండఁగ చీయనక యిందుఁ జెలఁగేదా వేయినామములవెన్నుఁడ మాయలు వోయయ్య యిఁకనొద్దనవే చ. నలి నీనామము నాలికనుండఁగ తలకొని యితరముఁ దడవేదా బలు శ్రీవేంకటపతి నిన్నుఁగొలిచి వొలుకుఁ జెంచలములొద్దనవే