పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

643 రేకు: 0359-03 లలిత సంపుటము:04-347 పల్లవి: ధ్రువవరదునివలె తుదకెక్కుఁగాక మరి యివల గర్మఫలంబు లేవైన సతమా చ. కరి రాజ వరదునకు కడఁగి శరణంటేను కరిఁగాచినట్లనే కాఁచుగాక పరదైవముల కెంత భంగపడి మొక్కినా అరసి రావణు కొసంగి నట్లనే కాదా చ. శ్రీపతినే అడిగినను జిగి నజామిళువలె చేపట్టి సిరుల రక్షించుఁగాక ఆపోక కౌరవుఁడు హరిపరాజ్ముఖుఁడైన పైపైనే సంపదలు పారుచేఁ బడవా చ. శ్రీవేంకటేశుఁడిచ్చేయినావరంబులే వోవలను బ్రిష్టమై యుండుఁగాక భావించ నితరములు పరలోకములయందు కైవశంబగు ననే కథల వలెఁగాదా రేకు:0061-03 ధన్నాశి సంపుటము: 01-312 పల్లవి: నంద నందన వేణునాద వినోదము కుంద కుంద దంత్రహాస గోవర్ధనధరా చ. రామ రామగోవింద రవిచంద్రలోచన కామ కాముకలుపు వికారవిదూరా ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజనిరూమధామ కరణచతుర భవభOజనా చ. కమల కమలవాస కమలారమణ దేవో త్తమ తమో గుణసతతవిదూర ప్రమదత్ర్పమదానుభవభావకరణ సుముఖ సుధానOద శుభరOజనా చ. పరమ పరాత్పర పరమేశ్వరా వరద వరదామల వాసుదేవ చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర నర హరినామ పన్నగశయనా రేకు: 9108-03 భూపాళం సంపుటము: 04-597 పల్లవి: నందకధర నందగోపనందన కందర్పజనక కరుణాత్మ చ. ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ శుకవరద సవితృ సుధాంశులోచన ప్రకటవిభవ నమో పరమాత్మ చ. ధ్రువ పాంచాలీ స్తుతివత్సల మా ధవ మధుసూదన ధరణిధరా భువనత్రయ పరిపాషణ తత్పర నవనీతప్రియ నాదాత్మ చ. శ్రీమన్ వేంకటశిఖరనివాస మ హమహిమన్ నిఖిలాండపతే కామితఫలభోగప్రద తే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్