పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

642 రేకు:0224-05 దేవగాంధారి సంపుటము: 03-136 పల్లవి: ధర్మాధర్మము లాల దైవము లాల నిర్మిత మాతఁడే కాని నే నేమీ నెఱఁగ చ. పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను నెట్టన నున్న పనులు నే నెఱఁగ వెట్టివాఁడ నేనింతే విష్ణుఁడు నా కేలికె చుట్టిన నడుమంత్రాల సుద్దులూ నెఱఁగ చ. లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను చేకొని కర్మములలో చేఁతలెరఁగ సాకిరి మాత్రము నేను సర్వజ్ఞఁడాతఁడు దాకొని నేఁ దలఁచేటి తలఁపూ నెఱఁగ చ. అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ పంతాన నాలోపలి భావ మెరఁగ యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటివాఁడ నేను చెంతల నానందమిది చెప్పనేమీ నెఱఁగ రేకు:0251-03 సామంతం సంపుటము: 03-292 పల్లవి: ధ్రువ విభీషణాదులు సాక్షి వివరపు జీవులు వెదకేదిది చ. దేవేంద్ర సంపద దిక్కుల కెక్కుడు కావిలినది యొుక కాలముది తావున శ్రీహరిదాసుల సంపద తేవల నెన్నఁడుఁ దీరనిది చ. బలువుగ నడచేటి బ్రహ్మపట్టమును తొలు బ్రహ్మాండము తోడిది జలజాక్షుని నిజశరణాగతి యిది కలకాలమునకుఁ గాణాచి చ. వైకుంఠమున కివ్వలిలోకంబులు రాకలపాశీకల రచనలవి యీకడ శ్రీవేంకటేశ్వరు సన్నిధి పైకొని దొరకిన బ్రదికేదిది రేకు: 0113-01 మాళవి సంపుటము:02-073 పల్లవి: ధ్రువవరదా సంస్తుతవరదా నవమైన యారుని నన్నుఁ గావవే చ. కలిరాజవరదా కాకాసురవరదా శరణాగతవిaషణ వరదా సిరుల వేదాలు నిన్నుఁ జెప్పగా వినీని మరిగి మఱఁగుచొచ్చే మమ్ముఁ గావవే చ. అక్రూరవరదా అంబరీషవరదా శక్రాది దివిజనిచయవరదా విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు చక్రధర శరణంటి సరిఁగావవే చ. ద్రౌపదీవరదా తగ నరునవరదా శ్రీపతీ ప్రపదశిశువరదా యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుఁడు చూపఁగా గొలిచే నచ్చుగఁ గావవే