పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

641 సారపు జీవుఁడు దాను సగుణమే నేరుపుల నాతని నిరుణము దలఁచిన తారతమ్యములులేని తానూ నిరుణమే రేకు:0283-04 మాళవిగౌళ సంపుటము: 03-479 పల్లవి: ధరలో నా జన్మమే తనువు నదియె చ. యిరవై నీ దాసుఁడైతే హీనుఁడైనా ఘనుఁడే అల రావణుని తమ్ముఁ డసురనరభోజనుఁడలరి తొల్లెల్లా నీ వాఁడైన మీఁదను కులజుఁడు పుణ్యుఁడు గుణనిధి యిందరునుఁ దలఁప యోగ్యుఁడు నట దాస్యమహి మెట్టిదో జాతిబోయ పాతకుఁడు సత్యతపుఁడట తొల్లి నీతి నరణియు నేటి నీ దాసుఁ జేరి ఆతల బ్రహ్మఋషాయ నష్టాక్షర మంత్రాన చేఁతల నీ దాసుల సేవాఫల మెట్టిదో . నానాజంతువులందు నవభక్తి గలిగితే హీనాధిక్యము లేక యేచి కాతువు శ్రీనాథ కాచితివి శ్రీవేంకటేశ మమ్ము నేనూ ధన్యుఁడనైతి నీమహిమ యెట్టిదో రేకు: 0371–05 కన్నడగౌళసంపుటము: 04-420 పల్లవి: ధరలోను జనహితము నానా భక్తరక్షణము నడపఁ గదయ్యా చ. చ. చ. హరీ నీకు నాగపాశబంధనమది నీమహిమకు నటు వెలితా తరవాతను రావణాది యసురల తలలు నరకుట ప్రతాపముగాదా మును నీపై నొక భూతము నడచిన మొగి నీమహిమకు నది వెలితా ఘనహుంకారము మాత్రమున డచినందు నే కడకుఁ దరముట ప్రతాపముగాదా కలియుగమున శ్రీవేంకటగిరిపైఁగదిసిన నీమహిమకు వెలితా కలిమల మథనుఁడ కల్క్యవతారము గయికొనుటచటఁ బ్రతాపముగాదా రేకు: 0349-06 శంకరాభరణం సంపుటము: 04-290 పల్లవి: ధర్మమునకే మము దయఁ గావవే యిఁక చ. నిర్మలుఁడవు నిను నే మెరిఁగేమా కాయధారులము కర్మలోలులము మాయ కగపడిన మనుజులము పాయపు మదమున భ్రమసే మా మనసు నీయెడఁ దగులై నిలిచీనా . చాపల్యగుణము జడులమన్నిటాను పాపపుణ్యసంబదులము పైపైఁగోర్కుల ప్రబలేమాబ్రదుకు యేపనులకు నీకెక్కీనా . అతిప్రాకృతులము అహంకారులము సతతOబునుఁ జOచలులము హితవుగ శ్రీవేంకటేశ యేలితివి తతితో నీభక్తి తగ మరచేమా