పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

640 గడియించే పదార్థాలు కలవెన్నైనా యెడయక శ్రీవేంకటేశ నీదయ గలి(గి?)తే జడియక నీదాసులు సంతసమందుదురు రేకు:0265-01 లలిత సంపుటము: 03–372 పల్లవి: ధరఁ గడపట నేజంతువుకైనా తన జన్మమే సుఖమై తోఁచు హరి గలఁడని తా నమ్మివుండఁగా నతఁడిచ్చే సుఖ మొల్లరు చ. మొదలఁ గొందరికి స్వర్గలోకమే మోక్షసుఖంబని తోఁచును అదె కొందరికి దేవత్వమే బ్రహ్మానందంబై తోఁచును వుదుటునఁ గొందరికి సంసారమే వున్నతసుఖమై తోఁచును తుద నా మీఁదటి హరిదాస్యసుఖము ధ్రువపట్టంబని కానరు చ. సారిదిఁ గొందరటు శూన్యతత్త్యమే సుఖమని మాఁటలనందురు యిరవెరఁగనివారికి ధనధాన్యము లెక్కువ సుఖమై తోఁచును నిరతిఁ గొందరికి చిరజీవులౌటే నిత్యసుఖంబని తోఁచును వరుసల శ్రీపతిపై భారంబిదె వైరాగ్యపుసుఖ మెఱఁగరు చ. యొక్కడ చూచిన మాయలసుఖములు యెన్నెనాఁ గలవెప్పుడును చొక్కపు శ్రీవేంకటపతి తోడుట సుఖియించేటి సుఖ మొల్లరు యిక్కడ నక్కడ నీతని దాసులే యేచి సుఖింతురు నిజసుఖము కిక్కిరిసిన యజ్ఞానాంధకారులు కిందును మీఁదును నెరఁగరు రేకు: 0155-04 దేసాళం సంపుటము:02-260 పల్లవి: ధరణి నెంద రెన్నితపములు చేసినాను హరికృపగలవాఁడే అన్నిటాఁ బూజ్యుఁడు చ. మితిలేని విత్తు లెన్ని మేదినిపైఁ జల్లినాను తతితో విత్తినవే తగఁ బండును యితరకాంతలు మఱి యెందరు గలిగినాను పతి మన్నించినదే పట్టపుదేవులు చ. పాలుపడి నరు లెన్నిపాట్లఁ బడి కొలిచినా - నేలికె చేపట్టనవాఁడె యొక్కుడుబంటు మూల నెంతధనమున్నా ముంచి దానధర్మములు తాలిమితో నిచ్చినదే దాఁపురమై నిల్చును చ. యెన్నికెకుఁ గొడుకులు యెందరు గలిగినాను యిన్నిటా ధర్మపరుఁడే యీడేరును వున్నతిఁ జదువులెన్ని వుండినా శ్రీవేంకటేశు సన్నుతించిన మంత్రమే సతమై ఫలించును రేకు:0186–04 గుండక్రియ సంపుటము: 02-435 పల్లవి: ధరలో "నెద్భావం తద్భవ"తనెఁ గాన హరిమయమే జగమంతాను చ. మహి నెదిటివారందు మలినము దలఁచిన తహతహ మనసే తా మలినము వహి నెదిటOదు భావనము భావించిన బహువిధములఁ దానూ భావనమే చ. యొక్కువ నెదిటిపాపా లెంచి నిందించేటి నిక్కపునాలుక తానే నిందితము వొక్కటై యెదిటిపుణ్యాలుగ్గడించి ఘనమంటే దక్కిన పుణ్యపు జిహ్వ తానూ ఘనమే చ. సారె శ్రీవేంకటపతి సగుణము దలఁచిన